ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించిన ఓ ప్రియుడికోసం ఇద్దరమ్మాయిలు బాహాబాహికి దిగారు. పబ్లిక్ లో అందరూ చూస్తుండగానే జుట్టు జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. 

ఔరంగాబాద్ : మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అది చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ ఏంటంటే.. ఒకే కుర్రాడిని ప్రేమించిన ఇద్దరు టీనేజర్లు.. ఆగండాగండి.. వీళ్లు ప్రేమించారా.. ఆ కుర్రాడే ఒకరికి తెలియకుండా మరొకరిని మేనేజ్ చేసుకుంటూ వచ్చాడా?..ఈ డౌట్ వచ్చిందా.. అదే నిజం.. అతనే ఇద్దర్నీ ఒకరికి తెలీకుండా మరొకర్ని మేనేజ్ చేశాడు. ఏదో టీవీ సీరియలో.. ఇద్దరు పెళ్లాల ముద్దులపోలీస్ లాంటి.. ఇద్దరు పెళ్లాల సినిమాలో గుర్తు కొస్తున్నాయా? అచ్చం అలాంటి ఘటనే ఇది.

అలాగే జరిగింది. ఆ కుర్రాడు కూడా కొద్ది రోజుల బాగానే మేనేజ్ చేశాడు. కానీ విషయం ఎన్ని రోజులు దాగుతుంది. అయితే, ఇక్కడే ట్విస్ట్.. ఈ విషయం బయట పడేసరికి కుర్రాడి కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ఆ అమ్మాయిలు.. అచ్చం తెలుగు సినిమా హీరోయిన్లలా ప్రవర్తించారు. మన హిందీ, తెలుగు సీరియల్స్ లోని హీరోయిన్లలా వాళ్లలో వాళ్లే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. ఇంతకీ ఇంతటి విడ్డూరం ఎక్కడా అంటే.. మహారాష్ట్రలోని పయ్ థాన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

భార్యపై ప్రేమ.. ఇంట్లోనే పూడ్చిపెట్టి, అంత్యక్రియలు.. భయాందోళనల్లో స్థానికులు.. చివరికి..

అసలు విషయం ఎలా బయటపడిందంటే.. ఇద్దరు అమ్మాయిల్లో.. ఒక అమ్మాయి సదరు కుర్రాడితో కలిసి స్థానిక బస్టాండ్ వద్దకు వచ్చింది. ఆ సమయంలో మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీరిద్దరిని చూసిన ఆమె.. వారి దగ్గరికి వచ్చి నిలదీసింది. దీంతో విషయం బయటపడింది. అంతే.. ఇద్దరూ కలిసి అతడిని కుమ్మాల్సింది పోయి.. ఆ ప్రియుడు తన వాడు అంటే తన వాడంటూ ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకున్నారు. అక్కడే ఉన్నకొందరు వీళ్లను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. ఈ గ్యాప్ లో ప్రియుడు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. అయినా అదేమీ పట్టించుకోకుండా అమ్మాయిలు ఫైటింగ్ కొనసాగించారు. ఈలోపు పోలీసులు వచ్చి ఇద్దరినీ స్టేషన్కు తరలించి, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.