బిహార్‌లో దొంగలు ఏకంగా బ్రిడ్జీనే మాయం చేసిన ఘటన హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. వినియోగంలో లేని బ్రిడ్జీని కూల్చేయాలని స్థానికులు గతంలోనే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. తాజాగా,  ఓ దొంగల ముఠా భారీ యంత్రాలు, గ్యాస్ కట్టర్లు, వాహనాలతో అక్కడ దిగి రెండు రోజులు శ్రమించి ఆ బ్రిడ్జీని కూల్చేసి ఐరన్‌ను వెహికిల్‌లో వేసుకుని పరారైంది. 

న్యూఢిల్లీ: బిహార్‌లో బ్రిడ్జీనే దొంగిలించిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భారీ మొత్తంలో ఐరన్‌ను కట్ చేసుకుని స్క్రాప్ కింద అమ్మేసుకున్నారు. ఈ చోరీకి వారు ఏకంగా పెద్ద పెద్ద వాహనాలు, మెషీన్లు, గ్యాస్ కట్టర్‌లు వినియోగించారు. రెండు రోజులు మొత్తం ఆ బ్రిడ్జీని కూల్చే పనిలోనే పడ్డారు. ఈ ఘటనపై అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.

ఆ చోర శూరులు భారీ స్కెచ్ వేశారు. బిహార్‌లోని మారుమూల గ్రామం అమియవార్ (రాజధాని పాట్నా నుంచి 150 కిలో మీటర్లు)లో మూడు దశాబ్దాల కింద కట్టిన బ్రిడ్జీపై కన్నేశారు. ఆ బ్రిడ్జీని కూల్చేయాలని అప్పటికే స్థానికులు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. స్థానికులు కూడా ఆ బ్రిడ్జీని రేపో మాపో కూల్చేస్తారనే ఆలోచనల్లోనే ఉన్నారు. ఈ సందర్భాన్ని ఆ దొంగలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

ఆ దొంగలు పెద్ద వాహనాలు, మెషీన్లు, గ్యాస్ కట్టర్లు, ఇతర సామాగ్రితో ఆ ఊరిలో దిగారు. ఇది చూసి స్థానికులు కొంత ఖంగారు పడ్డారు. వెంటనే ఎవరు వారు అని ఆరా తీశారు. తమను ఇరిగేషన్ శాఖ పని కోసం కుదర్చుకున్నదని వారికి సమాధానం ఇచ్చారు. ఇది వరకే ఆ బ్రిడ్జీని కూల్చేయాలని విజ్ఞప్తి చేసి ఉండటంతో వారు కూడా సులువుగానే వారిని నమ్మారు.

ఆ తర్వాత పని చేయడం మొదలుపెట్టారు. ఆ భారీ మెషీన్లతో రెండు రోజులు శ్రమించి ఆ బ్రిడ్జీని కూల్చేశారు. అందులోని ఐరన్‌ను ముక్కలుగా చేశారు. వాహనాల్లో ఆ ఐరన్‌ను తరలించారు. ఐరన్‌ను పెద్ద వెహికిల్‌లో ఎక్కించి ఆ సైట్ విడిచి పరారయ్యారు. తుక్కు కింద స్క్రాప్ షాప్‌కు అమ్మేశారు. 

వారు భారీ యంత్రాలు, గ్యాస్ కట్టర్‌లతో వచ్చారని, రెండు రోజులు డే లోనే పని చేసి బ్రిడ్జీని డిస్మాంటిల్ చేశారని ఆ గ్రామస్థుడు 29 ఏళ్ల గాంధీ చౌదరి తెలిపారు. 

ఆ దొంగల ముఠాకు చెందిన కొందరిని తాము గుర్తించినట్టు పోలీసులు అధికారులు తెలిపారు. కాగా, మిగితా వారిని ట్రాక్ చేయాల్సి ఉన్నదని వివరించారు. వారు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారని, ఒక బ్రిడ్జీనే దొంగిలించారని పోలీసు అధికారి సుబాష్ కుమార్ తెలిపారు.

వాటర్ కెనాల్‌పై మూడు దశాబ్దాల కింద నిర్మించిన పాత బ్రిడ్జీని కూల్చేయాలని అధికారులే నిర్ణయించి ఉంటారని స్థానికులు భావించారని పోలీసు అధికారి తెలిపారు. ఎందుకంటే ఈ బ్రిడ్జీ వినియోగం లేదని వివరించారు.

జిల్లాలోని నాసరీగంజ్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని అమియావార్​లో అర కెనాల్‌పై ఓ పురాతన ఐరన్​ బ్రిడ్జి ఉంది. దీని పొడవు 60 అడుగులకు పైగా ఉంది. ప్రస్తుతం ఆ బ్రిడ్జి శిథిలావస్థలో ఉంది. వాడుకలో లేని ఈ వంతెనలో భారీగా ఇనుము ఉండటం చూసి దొంగలు పక్కా ప్లాన్ వేశారు. నీటి పారుదల శాఖ అధికారుల వలె నటించిన దొంగలు.. బుల్‌డోజర్లు, గ్యాస్ కట్టర్‌ల సాయంతో బ్రిడ్జి మొత్తాన్ని కూల్చివేశారు. అనంతరం ఇనుమును మొత్తం వాహనాల్లో ఎక్కించి తరలించుకుపోయారు. మూడు రోజుల్లోనే తమ పని కానిచ్చేశారు. ఇలా అసాధారణ రీతిలో దోపిడికి పాల్పడ్డారు.