Asianet News TeluguAsianet News Telugu

మహిళా పోలీస్ తో ఎఫైర్.. ఇద్దరు కానిస్టేబుళ్ల బాహాబాహీ, పీఎస్ లో కాల్పుల కలకలం..అసలేం జరిగిందంటే..

ఓ మహిళ కోసం ఇద్దరు పోలీసులు తన్నుకున్నారు. అందులో ఒకరు పోలీస్ స్టేషన్ లో గన్ తో కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. 

two constables fight over affair with lady cop in Uttar Pradesh
Author
First Published Sep 7, 2022, 10:56 AM IST

బరేలీ : ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. బరేలీలోని బహేరి పోలీస్ స్టేషన్‌లో, ఇద్దరు కానిస్టేబుళ్లు మరో మహిళా కానిస్టేబుల్ గురించి బాహాబాహికి దిగారు. అంతటితో ఆగకుండా కాల్పులకు తెగబడ్డారు. దీంతో వీరిద్దరితో పాటు మరో ఐదుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన మీద అంతర్గత విచారణకు ఆదేశించారు. ఇక ఘటన వివరాల్లోకి వెడితే...

ఆ కానిస్టేబుళ్లు ఇద్దరూ 25-30యేళ్ల మధ్యవయస్కులే. తమ సహోద్యోగి అయిన ఓ మహిళా కానిస్టేబుల్ తో ఎఫైర్ విషయంలో వీరి మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం చెలరేగి అది తీవ్ర గొడవగా మారింది. దీంతో ఆ ఇద్దరిలో ఒకరైన మోను కుమార్ సర్వీస్ రివాల్వర్‌ తో స్టేషన్‌లో కాల్పులు జరిపాడు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే తూటాలు ఎవ్వరికీ తగలకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే అతను కేవలం పట్టరాని కోపంతో కాల్చాడు అంతేకానీ, ఎవ్వరినీ టార్గెట్ చేయలేదని.. బుల్లెట్లు నేలకే తాకాయని.. ఒక పోలీసు చెప్పుకొచ్చాడు. 

ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో వారు మోను కుమార్, మరో కానిస్టేబుల్, యోగేష్ చాహల్, ఇన్‌స్పెక్టర్ (క్రైమ్), SHOతో సహా ఐదుగురు పోలీసులను ఎస్సెస్పీ సత్యార్థ్ అనిరుద్ధ పంకజ్ "క్రమశిక్షణా చర్యలకింద" సస్పెండ్ చేశారు. వీరిని పోలీసు లైన్‌లకు అటాచ్ చేశారు. ఈ ఘటన మీద అంతర్గత విచారణకు కూడా ఆదేశించారు.

హోం వర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన టీచర్.. చికిత్స పొందుతూ బాలిక మృతి...

దీనిమీద ఎస్సెస్పీ సత్యార్థ్ అనిరుద్ధ పంకజ్ మాట్లాడుతూ "ఒక పోలీసు సహోద్యోగితో ఎఫైర్‌ పెట్టుకుంటే.. అది అతని వ్యక్తిగత విషయం. అందులో అభ్యంతరకరం చెప్పడానికి ఏమీ లేదు. అందులో చట్టవిరుద్ధమైనది కూడా ఏమీ లేదు. అందుకే ఈ ఘటనలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం అనే కారణాలపై మాత్రమే చర్యలు తీసుకోబడ్డాయి" అని తెలిపారు.

నిందితుల్లో ఒకరైన కుమార్ పశ్చిమ యూపీలోని బాగ్‌పత్ జిల్లాకు చెందినవాడు. డిసెంబర్ 2019లో బహేరి పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరాడు. అతని పొరుగు జిల్లా ముజఫర్‌నగర్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ ఈ సంవత్సరం ప్రారంభం జనవరిలో అదే పోలీస్ స్టేషన్‌లో చేరింది.  "కుమార్, ఆ మహిళా కానిస్టేబుల్ ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. ఆమెకు బహేరీ స్టేషన్‌లో పోస్టింగ్ రాకముందునుంచే.. నిరుడు యేడాది నుంచే వారి మధ్య రిలేషన్ ఉంది. వారిద్దరి కులాలు వేర్వేరు. దీంతో వీరి సంబంధం గురించి తెలిసిన కానిస్టేబుల్ చాహల్ పిచ్చి కామెంట్స్ చేసేవాడు.  

కాల్పుల ఘటన చోటుచేసుకోవడానికి రెండు రోజుల ముందు కూడా వీరి గురించి చులకనగా మాట్లాడడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే, ఇతర సహోద్యోగులు జోక్యం చేసుకోవడంతో ఇద్దరూ శాంతించారు.. అని వెలుగులోకి రాని దీని గురించి ఒక పోలీసు చెప్పుకొచ్చాడు. ఈ వాగ్వాదంలో కోపానికి వచ్చిన మోను లోడ్ చేసిన పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. దీంతో సస్పెండ్ కు గురైన వారిలో పోలీసు స్టేషన్‌లోని ఆయుధశాల ఇన్‌ఛార్జ్ మనోజ్ కుమార్ కూడా ఉన్నాడు. కాల్పులు జరిపిన తర్వాత, మోను తుపాకీని వెనక్కి అదే స్థలంలో పెట్టి, పోలీసు స్టేషన్ నుండి బయటికి వెళ్లిపోయాడు. సెలవు పెట్టాడు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించేందుకు బహేరి సర్కిల్ అధికారి తేజ్వీర్ సింగ్‌కు ఎస్‌ఎస్‌పి బాధ్యతలు అప్పగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios