ఒక్క బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారో తెలుసా?

Two college girls steal 38 phones for ‘a boyfriend’
Highlights


38 సెల్ ఫోన్లను.. ఆ ఇద్దరమ్మాయిలు

ఇద్దరు అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ కోసం చేసిన పని.. అందరినీ విస్తుపోయేలా చేసింది. ఇంతకీ వాళ్లిద్దరూ ఏం చేశారో తెలుసా.. 38 సెల్ ఫోన్లు  చోరీ చేశారు. ముంబయి నగరానికి చెందిన ఈ ఇద్దరు అమ్మాయిలు గత రెండు నెలలుగా లోకల్ ట్రైన్ లోని ఉమన్ కంపార్ట్ మెంట్ లలో ప్రయాణం చేస్తూ.. దాదాపు 38 ఫోన్లు చోరీ చేశారు.

సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులంతా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో ట్వింకిల్ సోనీ(20), తినాల్ పార్మర్(19) అనే ఇద్దరు యువతులు చోరీలు చేసినట్లు గుర్తించారు. ఈ ఫోన్లను రాహుల్ రాజ్ పురోహిత్ (28) అనే మరో యువకుడికి అమ్మేశారు. వీటి విలువ రూ.3లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. ఈ దొంగతనాలు ఇద్దరూ వారి బాయ్ ఫ్రెండ్ కోసం చేసినట్లు తెలిపారు. వీరిద్దరూ హరీష్ సింగ్ అనే యువకుడితో డేటింగ్ చేస్తున్నారు.  అతనితో గడపడానికి డబ్బు అవసరం కావడంతో.. ఈ విధంగా ఫోన్ల చోరీకి పాల్పడినట్లు వారు పోలీసులకు తెలిపారు.  గత నెల 30వ తేదీన ట్వింకిల్ సోనీ ఒకరి సెల్ ఫోన్ చోరీ చేస్తూ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. దీంతో.. ఈ వ్యవహారం బయటపడింది.

loader