గాంధీనగర్: ఇద్దరు మైనర్ విద్యార్ధులు ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ దంపతులుగా బతకాలని భావించాలని  నిర్ణయం తీసుకొని ఇంటి నుండి పారిపోయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాష్ట్రంలోని వడోదరలోని ఛాని గ్రామానికి చెందిన ఇద్దరు స్కూలు విద్యార్థులు గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. మార్చి నెలలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు మూసివేయటంతో ఇద్దరూ కలుసుకోవటం కుదరలేదు. 

దీంతో వారు ఇంటినుంచి పారిపోయి దంపతుల్లాగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు. గత ఏడాది డిసెంబర్‌ 28వ తేదీన ఇంటినుంచి పారిపోయారు. బాలుడు రూ. 25 వేలు, బాలిక ఐదు వేల రూపాయలు తీసుకెళ్లారు.

సయాజిగంజ్‌లో నెలకు 500 రూపాయల అద్దెతో ఓ ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. బాలుడు ఓ గార్మెంట్‌ కంపెనీలో పనిచేస్తూ రోజుకు 366 రూపాయలు సంపాదించేవాడు. 

also read:మధ్యప్రదేశ్‌లో మహిళపై దారుణం: నీళ్లడిగి గ్యాంగ్ రేప్, ప్రైవేట్ బాగాల్లో ఇలా...

ఆ డబ్బును ఇంటి నిర్వహణ కోసం ఖర్చు చేసేవారు. తమ పిల్లలు కనిపించకుండా పోవటంతో ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. 

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ రోజు సదరు బాలుడు అతడి మిత్రుడికి ఫోన్‌ చేయగా పోలీసులు ట్రాక్‌ చేశారు. అనంతరం అతడి ఆచూకీ తెలుసుకుని ఇద్దర్నీ సొంత గ్రామానికి తీసుకువచ్చారు.