భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ల మహిళపై నలుగురు అకృత్యానికి పాల్పడ్డారు. మహిళ శరీర భాగాల్లో  ఇనుప రాడ్లు దించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

also read:జార్ఖండ్ లో దారుణం: పరిహారం అడిగితే రేప్ చేశారు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింధి జిల్లాలో శనివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులు, సోదరితో కలిసి హర్ధి గ్రామానికి ఏకాంత ప్రదేశంలో నివాసం ఉంటుంది.జిల్లా కేంద్రానికి ఘటన జరిగిన ప్రాంతం 60 కి.మీ. దూరంలో ఉంటుంది. శనివారం నాడు రాత్రి 10 గంటల ప్రాంతంలో నలుగురు ఆమె షాపునకు వచ్చి తాగడానికి నీళ్లు అడిగారు. 

also read:ఆ సుఖం కోసం....: ప్రియుడి ప్రాణాలు తీసిన ప్రియురాలి ప్లాన్

నీళ్లు లేవని మహిళ చెప్పింది. దీంతో దుండగులు ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. అంతేకాదు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్ బాగాల్లో ఇనుపరాడ్లు దించి వెళ్లిపోయారు.

సంఘటన జరిగిన సమయంలో ఆమె ఇద్దరు కొడుకులు ఇంట్లో లేరు. బాధితురాలిని ఆమె సోదరి ఆసుపత్రికి తరలించింది.  మెరుగైన చికిత్స కోసం ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితులను అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామన్నారు.