Asianet News TeluguAsianet News Telugu

రెండు కార్లు ఢీ.. కారు బానెట్ పైనే అతడిని కిలోమీటర్ దూరం తీసుకెళ్లిన మహిళ (వీడియో)

కర్ణాటకలోని బెంగళూరులో రెండు కార్లు ఢీకొన్నాయి. తన కారును ఢీకొనడంతో కిందికి దిగి ఢీకొన్న కారును ఆగాలని సైగ చేశాడు. కానీ, ఆ మహిళ తన కారును ఆపలేదు. సరికదా అడ్డుగా అతడు నిలబడినా ముందుకు వెళ్లింది. దీంతో అతడు ఆమె కారు బానెట్ పైకి దూకాడు. అతడిని అలాగే ఒక కిలోమీటర్ మేరకు కారు బానెట్ పైనే తీసుకెళ్లింది.
 

two cars collided, woman droves car for one kilometre with the man on her car bonnet
Author
First Published Jan 20, 2023, 6:20 PM IST

న్యూఢిల్లీ: కర్ణాటకకు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. బెంగళూరులోని జ్ఞాన భారతి నగర్‌లో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ఒక కారులో నుంచి వ్యక్తి కిందికి దిగి తన కారును ఢీకొన్న కారును ఆపాలని కోరాడు. కానీ, ఆ కారు నడుపుతున్న మహిళ తన వాహనాన్ని ఆపలేదు. అలాగే ముందుకు తీసుకెళ్లింది. ప్రాణ రక్షణ కోసం ఆ కారు బానెట్ మీదికి ఆ వ్యక్తి దూకాడు. అయినా ఆ మహిళ కారును ఆపలేదు. కారు బానెట్ పైనే అతడు ఉండగా ఆమె తన వాహనాన్ని ఒక కిలోమీటర్ దూరం వరకు తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

పోలీసుల వివరాల ప్రకారం, జ్ఞాన భారతి నగర్ ఏరియాలో రెండు కారులు ఒకటి టాటా నిక్సన్, మరొకటి మారుతీ స్విఫ్ట్ కారు ఢీకొన్నాయి. టాటా నిక్సన్ కారును ప్రియాంక అనే మహిళ నడిపింది. పోలీసులు గుర్తించినట్టుగా దర్శన్ అనే వ్యక్తి స్విఫ్ట్ కారును నడిపారు. ప్రియాంక కారే దర్శన్ కారును ఢీకొన్నట్టు ట్రాఫిక్ వెస్ట్ డీసీపీ తెలిపారు. 

దీంతో కారు నుంచి బయటకు వచ్చిన దర్శన్ కారును ఆపాల్సిందిగా ప్రియాంకను కోరాడు. కానీ, ఆమె వల్గర్‌గా సంజ్ఞ చేస్తూ ముందుకే కదిలింది. అక్కడి నుంచి తప్పించుకుపోయేలా ప్రియాంక డ్రైవ్ చేసింది. కానీ, దర్శన్ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆమె కారును ఆపాడు. కానీ, ఆమె కారు నుంచి బయటకు దిగడానికి నిరాకరించింది. అలాగే ముందుకు పోనిచ్చింది. దీంతో మరో దారి లేక ప్రాణాలు కాపాడుకోవడానికి దర్శన్ ఆమె కారు బానెట్ పైకి దూకాడు. అయినా.. ఆమె తన కారును ఆపలేదు. ముందుకే తీసుకెళ్లింది. దీంతో కారు బానెట్ పై దర్శన్ పట్టులేకుండా వేలాడుతూ ఉన్నాడు. అతడిని అలాగే ఆమె సుమారు ఒక కిలోమీటర్ మేరకు తీసుకెళ్లింది.

Also Read: కారు బానెట్ పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన కారు.. ఢిల్లీలో ఘటన (వీడియో)

ప్రియాంక తన కారును ఆపిన తర్వాత దర్శన్, అతడి ఫ్రెండ్స్ ఆమె కారు పై దాడి చేశారు. ఆమె కారులోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. ఇరువురూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు డీసీపీ తెలిపారు.

హత్యా ప్రయత్నం కింద ప్రియాంక పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. మహిళతో అనుచితంగా వ్యవహరించారని దర్శన్, ఆయన మిత్రులపై కేసు నమోదైంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో దుమారం రేపింది.

Follow Us:
Download App:
  • android
  • ios