కాసేపు కునుకు.. కట్టుబట్టలతో మిగిలిన జవాన్లు.?

Two BSF soldiers looted at old Delhi Railway station
Highlights

కాసేపు కునుకు.. కట్టుబట్టలతో మిగిలిన జవాన్లు.? 

దేశాన్ని శత్రువుల బారి నుంచి రక్షించే బీఎస్ఎఫ్ జవాన్లను సైతం దోచుకుని దొంగలు తమ పని తనాన్ని చాటుకున్నారు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విశ్రాంతి తీసుకునేందుకు ఇద్దరు జవాన్లు వెయిటింగ్ రూమ్‌లో పడుకున్నారు. వారిని ఎప్పటి నుంచి గమనిస్తున్నారో ఏమోకానీ జవాన్లు అలా పడుకున్నారో లేదో... సైనికులకు చెందిన బట్టలు, లగేజీచ, వాచ్‌లను దోచేశారు.. నిద్రలేచి చూసిన జవానులు తమ వస్తువులు కనిపించకు షాక్‌కు గురయ్యారు.. వెంటనే దొంగతనం విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ చాలా అప్రమత్తంగా ఉంటాం.. అయితే ఈ వెయిటింగ్ రూమ్‌కి భద్రత ఉందని భావించి విశ్రాంతి తీసుకున్నామని.. ఇలా జరుగుతుందని అనుకోలేదని ఓ జవాను అన్నారు.. 
 

loader