పాక్ దురాగతం: ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి, ముగ్గురికి గాయాలు

Two BSF jawans killed, 3 civilians injured   as Pakistan violates ceasefire in J-K
Highlights

బీఎస్ఎప్ జవాన్లపై పాక్ కాల్పులు


న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన దుర్బుద్దిని చాటుకొంది.
అంతర్జాతీయ సరిహద్దులో ఆదివారం తెల్లవారుజామున పాక్
కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్
జవాన్లు మరణించారు. మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు.

 
 జమ్మూకశ్మీర్‌ పరగ్వాల్‌ సెక్టార్‌లోని అక్నూర్‌లో జమాన్‌
బెళా పోస్టుపై పాకిస్తాన్‌ రేంజర్లు దొంగ చాటుగా దాడి చేశారు.

ఈ దాడిలో బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ వీకే పాండే (27), ఏఎస్‌ఐ
ఎస్‌ఎన్‌ యాదవ్‌ (48) సహా ముగ్గురు పౌరులు మృతి
చెందారు.పాక్ పై భారత బలగాలు కూ దాడికి పాల్పడ్డాయని
పరగ్వాల్‌ చెక్‌ పోస్ట్‌ ఇన్‌చార్జ్‌ బ్రిజిలాల్‌ శర్మ తెలిపారు.

 పరగ్వాల్‌ సెక్టార్‌లోని 10 పోలీసు పోస్టులు, 30 గ్రామాలను
పాకిస్తాన్‌ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని బ్రిజిలాల్‌
చెప్పారు.


కాల్పులతో దిన దిన గండంగా బతుకున్న సరిహద్దు ప్రజల
కష్టాలను తొలగిద్దామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌
పిలుపుపై భారత్‌ సానుకూలత వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో
శాంతి స్థాపన కోసం చర్చలకు సిద్ధమని తెలిపింది. అయితే,
ప్రతిసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్‌
ఉల్లంఘిస్తూ, శాంతియుత వాతావరణానికి తావులేకుండా
చేస్తోంది.

loader