ఇంటింటికీ తిరిగి తోపుడు బండిమీద బట్టలు అమ్ముకునే వ్యాపారికి ఇద్దరు బాడీగార్డులు ఉన్నారు. ఈ విషయం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చూసిన వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లో తోపుడు బండిపై బట్టలు విక్రయించే ఓ వ్యక్తికి ఇద్దరు బాడీగార్డులు ఉన్నారు. ఆయన బట్టలు అమ్ముతుండగా బాడీగార్డులు తుపాకులతో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాల్ తోపుడు బండి మీద బట్టల వ్యాపారం చేస్తుంటాడు. అతను తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్ ను కలిశాడు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది.
కులం పేరుతో జుగేంద్ర సింగ్ తనను దూషించాడని రామేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై జుగేంద్ర సింగ్ హైకోర్టుకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే దయాల్ ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కోర్టుకు వచ్చిన దయాల్ ను చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. ఇద్దరు బాడీగార్డులను భద్రతగా నియమించాలని ఆదేశించారు. అలా అతనికి బాడీ గార్డులు ఏర్పాటు అయ్యారు.
ఎయిర్‌పోర్టులో రన్ వే పై వీధి కుక్క.. గో ఫస్ట్ విమాన ప్రయాణం డిలే
ఇదిలా ఉండగా, ఇలాంటి విచిత్ర ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. తమకు ఎంతో ఇష్టమైన… ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రెండు చిలకల్లో ఒకటి కనిపించకుండా పోవడంతో ఓ కుటుంబం విలవిల్లాడిపోతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తూ ఎంతో ప్రేమగా పెంచుకున్న చిలక కోసం రేయింబవళ్ళూ వెతుకుతోంది. ఆచూకీ చెప్పినవారికి రూ. 50,000 నజరానా ఇస్తామంటూ పోస్టర్లు వేశారు. ఈ ఆసక్తికర ఘటన కర్ణాటకలోని తుముకూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తుమకూరులోని జయనగర్ లో నివాసం ఉంటున్న కుటుంబం గత రెండున్నరేళ్లుగా రెండు ఆఫ్రికన్ చిలుకలు పెంచుకుంటుంది.
వాటిని ఇంటి సభ్యులుగానే భావించేవారు. ఏటా వాటి పుట్టిన రోజులను ఘనంగా నిర్వహించేవారట. కానీ ఈసారి రుస్తుం అనే చిలుక జూలై 16 నుంచి కనబడకపోవడంతో దానికోసం వెతుకుతూ నగరమంతటా పోస్టర్లు అతికించారు. ‘ఆ చిలుకను మేము ఎంతో మిస్ అవుతున్నాం. అది మా కుటుంబంలాగే. మీ బాల్కనీల్లో, కిటికీల వద్ద కనబడితే గుర్తించి మాకు చెప్పి సహాయం చేయండి. ఆ చిలుకతో మాకెంతో అటాచ్మెంట్ ఉంది. ఎక్కడైనా చూస్తే చెప్పండి. ఆచూకీ చెప్పినవారికి మేం. రూ. 50,000 అందజేస్తాం’ అని ఆ చిలుకను పెంచుకున్న కుటుంబ సభ్యులు పల్లవి, అర్జున్ తెలిపారు.
