ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రాకు న్యూయార్క్, సెంట్రల్ పార్క్ ఏరియాలో  కనిపించిన ఓ దృశ్యం ఆనందం, ఆశ్చర్యం కలగలిసి.. చిన్ననాటి జ్ఞాపకాలు ముప్పిరిగొనేలా చేశాయి. వెంటనే ఈ పిక్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. దీనికి ‘న్యూయార్క్, సెంట్రల్ పార్క్, డబ్బావాలి’ అని కాప్షన్ కూడా పెట్టారు. 

స్టీల్ టిఫిన్ బాక్సులతో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక జ్ఞాపకం ముడిపడి ఉంటుంది. స్కూలుకు లంచ్ బాక్సు తీసుకెళ్లడమో.. ఇష్టమైన ఫుడ్ ను అందులో పెట్టి.. ప్రేమించే వ్యక్తులకు అందించడమో.. మొదటిసారి లంచ్ బాక్స్... ఇలాంటివే ఎన్నో.. అయితే ఇది పూర్తిగా ఇండియన్ కల్చర్. ఆ స్టీల్ డబ్బాను ఆఫీసుకు వెళ్లే ఓ మహిళ చేతుల్లో.. న్యూయార్క్ వీధుల్లో చూస్తే మీ మనసులో ఎలాంటి భావాలు కలుగుతాయి?

ఒకేసారి ఆనందం, ఆశ్చర్యం కలగలిసి.. చిన్ననాటి జ్ఞాపకాలు ముప్పిరిగొంటాయి. ఇలాంటి భావనే ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రాకు కలిగింది. ఆయన న్యూయార్క్, సెంట్రల్ పార్క్ ఏరియాలో ఈ దృశ్యాన్ని గమనించారు. వెంటనే ఈ పిక్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. దీనికి ‘న్యూయార్క్, సెంట్రల్ పార్క్, డబ్బావాలి’ అని కాప్షన్ కూడా పెట్టారు. 

ముంబైలో పేరుమోసిన ‘డబ్బావాలా’ సేవలను గుర్తుచేసేలా ఈ పిక్ కు డబ్బావాలి అని పెట్టడంతో.. ఇది ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఆయన పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే 14,000 లైక్‌లు, 550 షేర్లు అయ్యాయి. ఇంతకీ ఈ ఫొటోలో ఏముంది అంటే.. 

ఒక మహిళ తన ఆఫీసు బ్యాగ్‌తో పాటు మూడు గిన్నెల స్టీల్ టిఫిన్ పట్టుకుని వెడుతుండడం కనిపిస్తుంది. దీనికి నెటిజన్ల నుంచి అనేక భావోద్వేగబరితమైన కామెంట్స్ వస్తున్నాయి. ఈ పోస్టుకు స్పందిస్తూ.. నెదర్లాండ్స్‌లోని ఓ భారతీయ యువతి.. తన దగ్గరున్న టిఫిన్ బాక్సు ఫోటో షేర్ చేసింది. దీంతోపాటు ‘నేనిప్పుడు పెద్దదాన్ని అయిపోవచ్చు... కానీ చిన్ననాటి డబ్బా బాగా గుర్తుకువచ్చింది. ఈ మధ్య ఇక్కడ కొనుకున్నా దీన్ని. ఇది మా అమ్మకు పెడితే. ఇంట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటూ నవ్వుకుంది..’ అని ఎమోషనల్ అయ్యింది. 

డబ్బావాలాల వీరాభిమాని మరొక వ్యక్తి “డబ్బావాలా భారతదేశానికి గర్వకారణం, చాలా మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి. వారు పర్ ఫెక్షన్, వందశాతం ఖచ్చితత్వానికి చిహ్నాలు. అలాగే న్యూయార్క్‌లో డబ్బావాలి ఎందుకు కాకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు. 

మరికొందరేమో ఆ టిఫిన్ లో ఏ ఫుడ్ ఉందోనని ఆసక్తి కనబరిచారు. ‘పప్పు, అన్నం, చపాతీ ఉన్నాయా.. లేక బర్గర్, శాండ్ విచ్ లా?’ అని క్యూరియాసిటీలో పడిపోయారు. 
మరొకరేమో, "స్టీల్ డబ్బాస్ ... చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపాయి’ అని భావేద్వాగాలను పంచుకున్నారు. మరొకరు స్టీల్ డబ్బానే ఓ "భావోద్వేగం" అని చెప్పుకొచ్చాడు.

ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో ఆసక్తికరమైన ఫుడ్ గురించి కూడా చక్కగా పంచుకుంటాడని తెలుసుకదా. అదేక్రమంలో ఇటీవల దోశ వేస్తున్న ఓ వ్యక్తి వీడియోను షేర్ చేస్తూ.. ఆ వంటవాడి వేగాన్ని రోబోతో పోల్చుతూ.. ఎంత ఫాస్ట్ గా ఎంత సేపైనా వేస్తాడు. అతన్ని చూస్తూ మనం అలిసిపోవాలిన కానీ.. అతనికి అలుపు రాదు.. అతను వేసే దోశలు చూస్తుంటే.. ఆకలి కేకలు పెడుతోంది... అంటూ కామెంట్ చేశారు.