Asianet News TeluguAsianet News Telugu

Latur Twins Rape: అన్న భార్య‌పై క‌న్నేసిన క‌వ‌ల సోద‌రుడు.. ఆరు నెలలుగా అత్యాచారం..

Latur Twins Rape: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఒకే రూపంలో ఉన్న క‌వ‌ల సోద‌రుడు త‌న అన్న భార్య‌పై క‌న్నేశాడు. మ‌రిది ఎవ‌రో.. త‌న భార్త ఎవ‌రో తెలుసుకోలేని ఆ యువ‌తిపై  ఆరు నెలలుగా లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆ విష‌యం తెలుసుకున్న బాధితురాలు త‌న భార్త‌. అత్త‌తో  అస‌లు విష‌య చెప్ప‌గా.. నోరు మూసుకుని మునుపటిలా సాగిపోమని ఉచిత సల‌హా ఇచ్చారు.  ఈ సంఘటన మహారాష్ట్రలోని లాతూర్​లో జరిగింది.
 

twin brother raped on sister in law as husband shocking revelation after 6 months latur
Author
Hyderabad, First Published May 21, 2022, 1:58 AM IST

Latur Twins Rape:  మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో మానవత్వం సిగ్గుపడే ఉదంతం వెలుగు చూసింది. ఒకే పోలికతో ఉన్న కారణంగా సోదరుడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు( కవల సోదరుడు). త‌న అన్న భార్య‌పై ఆరు నెల‌లుగా అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు తన భర్త, అత్తమామలకు విషయాన్ని చెప్పింది. అయితే అందరూ నోరు మూసుకుని అంతా మునుపటిలా సాగిపోమని ఉచిత సల‌హా ఇచ్చారు. దీంతో బాధితురాలి భర్త, బావ, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ సంఘటన మహారాష్ట్రలోని లాతూర్​లో జరిగింది.
  
వివ‌రాల్లోకెళ్తే..  లాతూర్ జిల్లాలోని రింగ్‌రోడ్ ప్రాంతంలో నివసిస్తున్న యువకుడితో 20 ఏళ్ల అమ్మాయికి గతేడాది వివాహం జరిగింది. ఈ యువకుడికి కవల సోదరుడు కూడా ఉన్నాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆ క‌వ‌ల సోద‌రుడు..ఆమెపై కన్నేశాడు. సోదరుడు లేని సమయంలో లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. ఇలా త‌న అన్న భార్య‌పై ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ బాధితురాలు .. తన మరిది చేస్తున్న దుశ్చర్యను గుర్తించి.. తన భర్త, అత్తమామలకు ఈ విషయాన్ని చెప్పింది. ఇంత సీరియస్ విషయాన్ని పట్టించుకోకుండా సైలెంట్ గా ఈ సంబంధాన్ని అలాగే కొనసాగించాలని త‌న భ‌ర్త‌ సూచించాడు.

అతడి సమాధానంతో  షాక్ అయిన యువతి. అనంత‌రం అత్తింటివారికి చెప్పింది. వారు సైతం అదే సెలవిచ్చారు. ఏంచేయాలో  అర్థం కానీ ఆ యువ‌తి..  పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తింటివారు రమ్మని ఫోన్​ చేస్తే తాను రానని స్పష్టం చేసింది. ఎందుకు అత్తవారింటికి వెళ్లడం లేదని తల్లిదండ్రులు అడగ్గా.. అసలు విషయం బయటపెట్టింది. ఈ విషయంపై వెంటనే శివాజీనగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఐపీసీలోని సెక్షన్​ 378, 323, 506, 24 కింద కవల సోదరులపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్​ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios