లక్నో: ట్యూషన్ కోసం ఇంటికి వచ్చిన మైనర్ బాలికపై ట్యూటర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని  ముజఫర్ నగర్‌లో చోటు చేసుకొంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ట్యూటర్ భార్య  ద్వారా ఈ విషయం వెలుగు చూసింది.

Also read:మహిళలు స్నానం చేస్తుండగా మొబైల్‌తో రికార్డ్: నిందితుడికి దేహశుద్ది, అరెస్ట్

ట్యూషన్‌కు వచ్చే మైనర్ బాలికను ప్రేమలోకి దింపాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి దిగాడు. ఈ ట్యూటర్‌కు మరో మహిళతో కూడ వివాహేతర సంబంధం ఉన్న విషయం  వెలుగు చూసింది. ఆ మహిళకు ఈ ట్యూటర్ ద్వారా ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని ఆయన భార్య తెలిపింది.

బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు విద్యాబుద్దులు చెబుతారని నమ్మి ట్యూటర్  వద్దకు పంపితే  అతను మైనర్ బాలికను మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.