కర్ణాటక తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలుకాలోని హులియూరు దుర్గ సమీపంలోని అక్కిమరిపాళ్యలో విషాదం చోటుచేసుకుంది. 5 నెలల క్రితం 25 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి.. మంగళవారం ఉదయం తోటలో శవమై కనిపించాడు.
కర్ణాటక తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలుకాలోని హులియూరు దుర్గ సమీపంలోని అక్కిమరిపాళ్యలో విషాదం చోటుచేసుకుంది. 5 నెలల క్రితం 25 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి.. మంగళవారం ఉదయం తోటలో శవమై కనిపించాడు. కుటుంబ తగాదాలతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. అక్కిమరిపాళ్యకు చెందిన శంకరప్పకు 45 ఏళ్లు.. అయితే అతనికి విహహం కాలేదు. మరోవైపు మేఘనకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే పెళ్లైనా ఏడాదికే మేఘనను భర్త వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడు తిరిగిరాలేదు. దీంతో రెండేళ్లుగా మేఘన ఒంటరిగానే ఉంది.
ఈ క్రమంలోనే శంకరప్పను వివాహం చేసుకోవడానికి మేఘన అంగీకరించింది. ఇందుకు శంకరప్ప కూడా ఒప్పుకోవడంతో గతేడాది అక్టోబర్‌లో ఓ గుడిలో వీరి వివాహం జరిగింది. అయితే ఇరువురి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం కారణంగా అప్పట్లో ఈ పెళ్లి తెగ చర్చనీయాంశంగా మారింది. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాతో తెగ వైరల్ అయ్యాయి.
అయితే గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచి శంకరప్ప పేరు మీద ఉన్న రెండున్నర ఎకరాల భూమిని అమ్మివేయాలని మేఘన ఒత్తిడి తెచ్చింది. ఆ భూమిని అమ్మేసి.. బెంగళూరు లేదా మైసూరుకు వెళ్లి సెటిల్ అవ్వాలని మేఘన డిమాండ్ చేసింది. అయితే ఇందుకు శంకరప్ప అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వారి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై శంకరప్ప తల్లికి, మేఘనకు మధ్య గొడవలు జరిగాయి. అయితే తన తల్లితో కలిసి ఊరిలోనే ఉండాలని శంకరప్ప.. మేఘనను ఒప్పించాలని చూశాడు. అయితే మేఘన అందుకు అంగీకరించలేదు.
సోమవారం సాయంత్రం కూడా అత్తా-కోడలు మధ్య గొడవ జరిగింది. దీంతో విసిగిపోయిన శంకరప్ప మంగవారం ఉదయం పెరట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న హులియూరు దుర్గ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.
