నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Tuesday 4th October Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:51 PM IST

పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డికి కీలక పదవి

వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి  పార్లమెంట్‌లో కీలక పదవి దక్కింది. రవాణా , సాంస్కృతిక, పర్యాటక శాఖలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి విజయసాయిరెడ్డిని ఛైర్మన్‌గా నియమిస్తూ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

9:21 PM IST

భారత్ లక్ష్యం 228

భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇండోర్‌లో జరుగుతోన్న చివరి టీ20 మ్యాచ్‌లో సఫారీలు రెచ్చిపోయారు. టీమిండియా ఎదుట ఏకంగా 228 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. రిలీ రోసోవ్ 100 పరుగులు, డికాక్ 68, ట్రిస్టన్ స్టబ్స్ 23 చేశారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దీపక్ చాహర్ చెరో వికెట్ తీశారు. 

8:36 PM IST

రాహుల్ నన్నేమి తప్పుకోమనలేదు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని తనను రాహుల్ గాంధీ కోరినట్లుగా వస్తోన్న వార్తలను శశిథరూర్ ఖండించారు. కానీ కొందరు సీనియర్లు మాత్రం తన పోటీ విషయంగా రాహుల్‌తో మాట్లాడారని ఆయన చెప్పారు. తనకు ఇప్పటి వరకు మద్ధతుగా నిలిచిన వారికి తాను ద్రోహం చేయనని శశిథరూర్ స్పష్టం చేశారు. 
 
7:58 PM IST

5జీ సేవలపై జియో కీలక ప్రకటన

దేశంలో 5జీ సేవలకు సంబంధించి రిలయన్స్ జియో కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి ట్రయల్స్ కింద వినియోగదారులకు 5జీ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ఈ సేవలు అందిస్తామని చెప్పింది. దీపావళి నుంచి పూర్తి స్థాయిలో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామని జియో పేర్కొంది. 

7:12 PM IST

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇండోర్‌లో జరుగుతోన్న చివరి టీ20 టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే భారత్ 2-0 తో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

6:30 PM IST

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ అరెస్ట్‌కు ఆదేశం

శ్రీకాళహస్తి సీఐ వ్యవహారశైలిపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. సీఐపై తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏపీ డీజీపీని కమీషన్ ఆదేశించింది. ఇప్పటికే సీఐ అంజూ యాదవ్‌ను విచారించారు ఎస్పీ.

5:33 PM IST

గాంధీపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద ట్వీట్

అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు జాతిపితను కించపరిచేలా రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాహుల్... గాంధీజీ గొప్పవారని నేను అనుకోవడం లేదు' అని కామెంట్ పోస్ట్ చేశారు. ఈ కామెంట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక నెటిజెన్స్ ఓ రేంజ్ లో రాహుల్ పై యుద్ధానికి దిగారు. బండ బూతులతో రెచ్చిపోయారు. గాంధీ జయంతి నాడు మందు దొరకదు కదా.. రాహుల్ కి పిచ్చి లేచి ఇలాంటి ట్వీట్స్ వేస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు

4:54 PM IST

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

2022 ఏడాదికి గాను భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ లభించింది. అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసెర్, ఆంటోన్ జెల్లింగర్‌లను ఈ మేరకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. 

4:06 PM IST

ఎఫ్ఎమ్ రేడియో ఫేజ్-3 పాలసీ గైడ్‌లైన్స్‌లో సవరణలు

ప్రైవేట్ ఎఫ్.ఎమ్ ఫేజ్-3 పాలసీ గైడ్ లైన్స్ అని పిలువబడే ప్ర‌యివేటు ఏజెన్సీలు (ఫేజ్- III) ఎఫ్.ఎమ్ రేడియో ప్రసార సేవలను పొడిగించడంపై పాలసీ మార్గదర్శకాల్లో ఉన్న కొన్ని నిబంధనల సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన గత కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నార‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ స‌వ‌ర‌ణ‌లు ఒకసారి అమలులోకి వస్తే, దేశవ్యాప్తంగా ఎఫ్ఎం రేడియో సేవ‌ల‌ను విస్తరించడం మ‌రింత‌ సులభం అవుతుంది.

2:34 PM IST

పవన్ రాష్ట్రాన్ని ఏలాలని కోరుకుంటున్నా... నేనూ మద్దతివ్వొచ్చేమో..: చిరంజీవి

గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పవన్ నిబద్దత, నిజాయితీ గురించి తనకి తెలుసని... అలాంటి నాయకుడే మనకు కావాల్సిందని చిరంజీవి అన్నారు. పవన్ రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇవ్వాలని... అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం తాను పాలిటిక్స్ నుండి ఎగ్జిట్ అయి సైలెంట్ గా ఉన్నానని... భవిష్యత్ లో పవన్ కు సపోర్ట్ ఇవ్వొచ్చెమో అంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

12:55 PM IST

టీ20 వరల్డ్ కప్ కు ముందే టీమిండియాకు బిగ్ షాక్... బుమ్రా కీలక ప్రకటన

టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియాకు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న తాను ఈ టీ20 ప్రపంచకప్ కు దూరం కానున్నట్లు  బుమ్రా ట్వీట్ చేసాడు. 

12:12 PM IST

అమ్మవారిని దర్శించుకుని తిరిగెళుతూ... రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

నవరాత్రి వేడుకల సమయంలో భవానిమాతను దర్శించుకుని వెళుతున్న ఐదుగురు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన విషాదం మహారాష్ట్ర లాతూరు జిల్లాలో చోటుచేసుకుంది. తుల్జాపూర్ భవానిమాతను దర్శించుకుని కారులో తిరుగుపయనమైన ఓ కుటుంబం ఉద్గిర్‌-నలెగావ్ రోడ్డులో హైబత్ పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో కారులోని ఐదుగురు మృతిచెందారు.   
 
11:03 AM IST

జపాన్ లో నార్త్ కొరియా క్షిపణి కలకలం...

జపాన్ లో నార్త్ కొరియా క్షిపణి కలకలం రేపుతోంది. తమ దేశ సరిహద్దును దాటి జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగించింది. దీంతో అప్రమత్తమైన జపాన్ దేశప్రజలను జాగ్రత్తగా వుండాలని ఆదేశించింది. తమ దేశంమీదుగా జరిపిన క్షిపణి ప్రయోగాన్ని జపాన్ ప్రధాని కిషిదా ఖండించారు. 

10:25 AM IST

గుడ్ న్యూస్... దేశంలో రెండువేల దిగువకు కరోనా కేసులు

భారతదేశంలో 133 రోజుల తర్వాత ఇవాళ (గత 24 గంటల్లో) అతి తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కేవలం 1,968 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనాతో బాధపడుతున్న 15 మంది మృతిచెందారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కేవలం 34,594 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

9:49 AM IST

మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలు... గాంధీభవన్ లో నేడు కీలక భేటీ

మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కీలక సమావేశం ఏర్పాటుచేసింది. గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కమ్ ఠాగూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు మండల ఇంచార్జీలతో సమావేశం కానున్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

9:48 AM IST

సినిమా స్టైల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ ... రూ.9 కోట్ల కొకైన్ కడుపులో దాచిన కేటుగాడు

సినీపక్కీలో పొట్టలో డ్రగ్స్ దాచి స్మగ్లింగ్ చేస్తున్న ఓ కేటుగాడు దేశ రాజధాని న్యూడిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. రూ.9 కోట్ల విలువైన 599 గ్రాముల కొకైన్ ను క్యాప్సుల్స్ రూపంలో కడుపులో దాచి స్మగ్లింగ్ కు యత్నించగా కస్టమ్స్ అదికారులు సదరు స్మగ్లర్ ఆటకట్టించారు. ఆపరేషన్ చేసి అతడి కడుపులోని కొకైన్ ను బయటకు తీయించి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడిన అతడిపై ఎన్డిఫిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. 
 
9:51 PM IST:

వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి  పార్లమెంట్‌లో కీలక పదవి దక్కింది. రవాణా , సాంస్కృతిక, పర్యాటక శాఖలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి విజయసాయిరెడ్డిని ఛైర్మన్‌గా నియమిస్తూ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

9:21 PM IST:

భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇండోర్‌లో జరుగుతోన్న చివరి టీ20 మ్యాచ్‌లో సఫారీలు రెచ్చిపోయారు. టీమిండియా ఎదుట ఏకంగా 228 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. రిలీ రోసోవ్ 100 పరుగులు, డికాక్ 68, ట్రిస్టన్ స్టబ్స్ 23 చేశారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దీపక్ చాహర్ చెరో వికెట్ తీశారు. 

8:36 PM IST:

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని తనను రాహుల్ గాంధీ కోరినట్లుగా వస్తోన్న వార్తలను శశిథరూర్ ఖండించారు. కానీ కొందరు సీనియర్లు మాత్రం తన పోటీ విషయంగా రాహుల్‌తో మాట్లాడారని ఆయన చెప్పారు. తనకు ఇప్పటి వరకు మద్ధతుగా నిలిచిన వారికి తాను ద్రోహం చేయనని శశిథరూర్ స్పష్టం చేశారు. 
 
7:58 PM IST:

దేశంలో 5జీ సేవలకు సంబంధించి రిలయన్స్ జియో కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి ట్రయల్స్ కింద వినియోగదారులకు 5జీ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ఈ సేవలు అందిస్తామని చెప్పింది. దీపావళి నుంచి పూర్తి స్థాయిలో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామని జియో పేర్కొంది. 

7:12 PM IST:

భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇండోర్‌లో జరుగుతోన్న చివరి టీ20 టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే భారత్ 2-0 తో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

6:30 PM IST:

శ్రీకాళహస్తి సీఐ వ్యవహారశైలిపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. సీఐపై తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏపీ డీజీపీని కమీషన్ ఆదేశించింది. ఇప్పటికే సీఐ అంజూ యాదవ్‌ను విచారించారు ఎస్పీ.

5:33 PM IST:

అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు జాతిపితను కించపరిచేలా రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాహుల్... గాంధీజీ గొప్పవారని నేను అనుకోవడం లేదు' అని కామెంట్ పోస్ట్ చేశారు. ఈ కామెంట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక నెటిజెన్స్ ఓ రేంజ్ లో రాహుల్ పై యుద్ధానికి దిగారు. బండ బూతులతో రెచ్చిపోయారు. గాంధీ జయంతి నాడు మందు దొరకదు కదా.. రాహుల్ కి పిచ్చి లేచి ఇలాంటి ట్వీట్స్ వేస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు

4:54 PM IST:

2022 ఏడాదికి గాను భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ లభించింది. అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసెర్, ఆంటోన్ జెల్లింగర్‌లను ఈ మేరకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. 

4:06 PM IST:

ప్రైవేట్ ఎఫ్.ఎమ్ ఫేజ్-3 పాలసీ గైడ్ లైన్స్ అని పిలువబడే ప్ర‌యివేటు ఏజెన్సీలు (ఫేజ్- III) ఎఫ్.ఎమ్ రేడియో ప్రసార సేవలను పొడిగించడంపై పాలసీ మార్గదర్శకాల్లో ఉన్న కొన్ని నిబంధనల సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన గత కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నార‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ స‌వ‌ర‌ణ‌లు ఒకసారి అమలులోకి వస్తే, దేశవ్యాప్తంగా ఎఫ్ఎం రేడియో సేవ‌ల‌ను విస్తరించడం మ‌రింత‌ సులభం అవుతుంది.

2:34 PM IST:

గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పవన్ నిబద్దత, నిజాయితీ గురించి తనకి తెలుసని... అలాంటి నాయకుడే మనకు కావాల్సిందని చిరంజీవి అన్నారు. పవన్ రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇవ్వాలని... అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం తాను పాలిటిక్స్ నుండి ఎగ్జిట్ అయి సైలెంట్ గా ఉన్నానని... భవిష్యత్ లో పవన్ కు సపోర్ట్ ఇవ్వొచ్చెమో అంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

12:55 PM IST:

టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియాకు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న తాను ఈ టీ20 ప్రపంచకప్ కు దూరం కానున్నట్లు  బుమ్రా ట్వీట్ చేసాడు. 

12:12 PM IST:

నవరాత్రి వేడుకల సమయంలో భవానిమాతను దర్శించుకుని వెళుతున్న ఐదుగురు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన విషాదం మహారాష్ట్ర లాతూరు జిల్లాలో చోటుచేసుకుంది. తుల్జాపూర్ భవానిమాతను దర్శించుకుని కారులో తిరుగుపయనమైన ఓ కుటుంబం ఉద్గిర్‌-నలెగావ్ రోడ్డులో హైబత్ పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో కారులోని ఐదుగురు మృతిచెందారు.   
 
11:03 AM IST:

జపాన్ లో నార్త్ కొరియా క్షిపణి కలకలం రేపుతోంది. తమ దేశ సరిహద్దును దాటి జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగించింది. దీంతో అప్రమత్తమైన జపాన్ దేశప్రజలను జాగ్రత్తగా వుండాలని ఆదేశించింది. తమ దేశంమీదుగా జరిపిన క్షిపణి ప్రయోగాన్ని జపాన్ ప్రధాని కిషిదా ఖండించారు. 

10:25 AM IST:

భారతదేశంలో 133 రోజుల తర్వాత ఇవాళ (గత 24 గంటల్లో) అతి తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కేవలం 1,968 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనాతో బాధపడుతున్న 15 మంది మృతిచెందారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కేవలం 34,594 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

9:49 AM IST:

మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కీలక సమావేశం ఏర్పాటుచేసింది. గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కమ్ ఠాగూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు మండల ఇంచార్జీలతో సమావేశం కానున్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

9:48 AM IST: