నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Tuesday 20th September telugu news live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

10:03 PM IST

పోలీసుల సమస్యలపై దృష్టి పెట్టండి : పవన్

రాష్ట్రంలో పోలీసుల సమస్యలపై దృష్టి పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి హితవు పలికారు. పోలీసులకు భత్యాలు, లోన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోలీసుల భద్రత పేరుతో జీతం నుంచి తీసుకుంటున్న సొమ్ము ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ నిలదీశారు. 
 
9:08 PM IST

మొహాలీలో దంచికొట్టిన భారత్.. ఆసీస్ టార్గెట్ 209 పరుగులు

మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్డిక్ పాండ్యా 71, కేఎల్ రాహుల్ 55 , సూర్యకుమార్ యాదవ్ 46 పరుగులు చేశారు. 

8:22 PM IST

విజయనగరంలో డ్రగ్స్ కలకలం

విజయనగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తరలిస్తుండగా సందీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. చీపురుపల్లిలో అతనిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 65 ఎండీఎంఏతో పాటు ఎల్ఎస్‌డీ స్వాధీనం చేసుకున్నారు. 
 
7:17 PM IST

ఆస్కార్‌ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్‌కు నో ఎంట్రీ

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్స్ రేసులో తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్‌కు ఎంట్రీ లభించలేదు. అలాగే ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి కూడా చోటు దక్కలేదు. వీటికి బదులుగా గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ సినిమాకు అవకాశం దక్కింది. 

6:25 PM IST

శ్రీవారికి రూ.1.02 కోట్ల విరాళం

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు 1.02 కోట్ల విరాళం అందజేశారు. చెన్నైకి చెందిన సుబీనా భాను, అబ్దుల్ ఘనీ దంపతులు అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, పద్మావతి భవనంలో ఫర్నీచర్, వంటశాలలో వివిధ సామాగ్రి కోసం రూ.87 లక్షలు మొత్తం 1.02 కోట్లను విరాళంగా అందజేశారు. 

5:24 PM IST

రైలు ఢీకొని ముగ్గురి మృతి

పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో రైలు ఢీకొని ముగ్గురు రైల్వే కార్మికులు దుర్మరణం పాలయ్యారు. హుస్సేన్‌మియా వాగు వద్ద వీరు మరమ్మత్తులు చేస్తుండగా.. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

4:22 PM IST

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్

దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ కూడా లాభాలతో ముగిసాయి. నేటి మార్కెట్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 579 పాయింట్ల లాభంతో 57,719 వద్ద, నిఫ్టి 194 పాయింట్ల లాభంతో 17,816 వద్ద స్థిరపడ్డాయి. 

3:33 PM IST

చైల్డ్ పోర్నోగ్రపి వీడియోలు... ట్విట్టర్ డిల్లి మహిళా కమీషన్ సమన్లు

చైల్డ్ పోర్నోగ్రపి వీడియోలు మైక్రోబ్లాగింగ్ సైట్స్ లో అందుబాటులో వుండటాన్ని సీరియస్ గా తీసుకున్న  డిల్లీ మహిళా కమీషన్ ట్విట్టర్ తో పాటు డిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేసింది. చండీఘడ్ యూనివర్సిటీ విద్యార్థినుల అశ్లీల వీడియో ఘటన తర్వాత అప్రమత్తమై ఇలాంటి వ్యవహారాలపై దృష్టిపెట్టినట్లు మహిళా కమీషన్ చీఫ్ స్వాతి మాలివాల్ తెలిపారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో చైల్డ్ పోర్నోగ్రపి వీడియోలను గుర్తించి ఆ సంస్థకు సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. వివరణ ఇవ్వడానికి సెప్టెంబర్ 26వ తేదీ వరకు సమయం ఇచ్చినట్లు మహిళా కమీషన్ వెల్లడింది.
 
2:17 PM IST

తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు... ఎల్లో అలర్డ్ జారీ

రానున్న రెండ్రోజులు తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మళ్లీ వర్షాలు మొదలయ్యాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఎల్లో అలర్డ్ జారీ చేసారు. 

1:17 PM IST

టార్గెట్ కుప్పం... చంద్రబాబు ఇలాకాలో మరోసారి సీఎం జగన్ పర్యటన

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడు సొంత నియోజకవర్గంలో పర్యటనకు సిద్దమయ్యారు. ఎల్లుండి (గురువారం) కుప్పం వేదికగా మూడో విడత వైఎస్సార్‌ చేయూత పథకం నిధులను సీఎం విడుదల చేయనున్నారు. ఇందుకోసం కుప్పంలో వైసిపి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. 

12:10 PM IST

గోవా కాంగ్రెస్ కు నూతన సీఎల్పీ నియామకం

ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడంతో సంకటపరిస్థితుల్లో వున్న గోవా కాంగ్రెస్ కు నూతన సీఎల్పీని నియమించింది అధిష్టానం. ఎమ్మెల్యే యూరి అలేమావో కు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. 

11:43 AM IST

టిడిపి సభ్యుల ఆందోళనతో గందరగోళం... ఏపీ అసెంబ్లీ వాయిదా

టిడిపి సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలు కొనసాగించాలంటూ టీడీపీ సభ్యుల డిమాండ్ చేస్తూ సభలోనే టిడిపి సభ్యులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేసారు. 

11:15 AM IST

ఏపీ అసెంబ్లీ ముట్టడికి టిడిపి యత్నం... తీవ్ర ఉద్రిక్తత

జగన్ సర్కార్ పాలనలో రాష్ట్రం అదోగతి పాలవుతోందని... ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారంటూ ఆరోపిస్తూ ప్రతిపక్ష టిడిపి నాయకులు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి టిడిపి నేతలు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో అసెంబ్లీ సమీపంలోని ఓ భవనం ఎక్కి ఆందోళన చేపట్టారు. ఇలా నిరసనకు దిగినవారిలో కాపు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ నాయకులు వున్నారు. వీరిని పోలీసులు బిల్డింగ్ పైనుంచి కిందకుదించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

10:16 AM IST

ఉద్రిక్తత... జిహెచ్ఎంసి కార్యాలయం ముట్టడికి కాంట్రాక్టర్ల యత్నం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వివిధ పనులు చేపట్టి బిల్లులు రాక ఇబ్బందిపడుతున్న కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు. లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసి కార్యాలయం వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే వున్న పోలీసులు వారిని అడ్డుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  పెండింగ్ లో వున్న రూ.800 కోట్ల బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.  

9:36 AM IST

నాలుగోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ... విష జ్వరాలపై వాడివేడి చర్చ

నాలుగోరోజు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట స్పీకర్ తమ్మినేని సీతారాం క్వశ్చన్ అవర్ ప్రారంభించగానే వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని రాష్ట్రంలో విషజ్వరాల వల్ల మరణాలేవి సంబవించలేదని తెలిపారు. టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు మాట్లాడుతూ ఇటీవల వరదల సమయంలో సీఎం జగన్ ను కలిసిన చిన్నారి డెంగ్యూతో చనిపోయినట్లు వార్తలు వచ్చాయని గుర్తుచేసారు. ఇలా ప్రశ్నోత్తరాలతో సభ వాడివేడిగా సాగుతోంది. 

9:28 AM IST

బిహార్ లో విషాదం... పిడుగుపాట్లకు 11 మంది బలి

బిహార్ లో కురుస్తన్న వర్షాలు భారీగా ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. వర్షాలకు తోడు పిడుగులు పడటంతో  11 మంది మృతిచెందారు. ఇలా పిడుగుపాటు మరణాలపై స్పందించిన సీఎం నితీష్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.  పూర్ణియాలో నలుగురు, అరేరియాలో మరో నలుగురు, సుపాల్ లో ముగ్గురు ఇలా మొత్తం 11 మంది పిడుగుపాటుతో మృతిచెందారు. 

10:03 PM IST:

రాష్ట్రంలో పోలీసుల సమస్యలపై దృష్టి పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి హితవు పలికారు. పోలీసులకు భత్యాలు, లోన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోలీసుల భద్రత పేరుతో జీతం నుంచి తీసుకుంటున్న సొమ్ము ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ నిలదీశారు. 
 
9:08 PM IST:

మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్డిక్ పాండ్యా 71, కేఎల్ రాహుల్ 55 , సూర్యకుమార్ యాదవ్ 46 పరుగులు చేశారు. 

8:22 PM IST:

విజయనగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తరలిస్తుండగా సందీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. చీపురుపల్లిలో అతనిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 65 ఎండీఎంఏతో పాటు ఎల్ఎస్‌డీ స్వాధీనం చేసుకున్నారు. 
 
7:17 PM IST:

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్స్ రేసులో తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్‌కు ఎంట్రీ లభించలేదు. అలాగే ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి కూడా చోటు దక్కలేదు. వీటికి బదులుగా గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ సినిమాకు అవకాశం దక్కింది. 

6:25 PM IST:

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు 1.02 కోట్ల విరాళం అందజేశారు. చెన్నైకి చెందిన సుబీనా భాను, అబ్దుల్ ఘనీ దంపతులు అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, పద్మావతి భవనంలో ఫర్నీచర్, వంటశాలలో వివిధ సామాగ్రి కోసం రూ.87 లక్షలు మొత్తం 1.02 కోట్లను విరాళంగా అందజేశారు. 

5:24 PM IST:

పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో రైలు ఢీకొని ముగ్గురు రైల్వే కార్మికులు దుర్మరణం పాలయ్యారు. హుస్సేన్‌మియా వాగు వద్ద వీరు మరమ్మత్తులు చేస్తుండగా.. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

4:22 PM IST:

దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ కూడా లాభాలతో ముగిసాయి. నేటి మార్కెట్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 579 పాయింట్ల లాభంతో 57,719 వద్ద, నిఫ్టి 194 పాయింట్ల లాభంతో 17,816 వద్ద స్థిరపడ్డాయి. 

3:33 PM IST:

చైల్డ్ పోర్నోగ్రపి వీడియోలు మైక్రోబ్లాగింగ్ సైట్స్ లో అందుబాటులో వుండటాన్ని సీరియస్ గా తీసుకున్న  డిల్లీ మహిళా కమీషన్ ట్విట్టర్ తో పాటు డిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేసింది. చండీఘడ్ యూనివర్సిటీ విద్యార్థినుల అశ్లీల వీడియో ఘటన తర్వాత అప్రమత్తమై ఇలాంటి వ్యవహారాలపై దృష్టిపెట్టినట్లు మహిళా కమీషన్ చీఫ్ స్వాతి మాలివాల్ తెలిపారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో చైల్డ్ పోర్నోగ్రపి వీడియోలను గుర్తించి ఆ సంస్థకు సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. వివరణ ఇవ్వడానికి సెప్టెంబర్ 26వ తేదీ వరకు సమయం ఇచ్చినట్లు మహిళా కమీషన్ వెల్లడింది.
 
2:17 PM IST:

రానున్న రెండ్రోజులు తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మళ్లీ వర్షాలు మొదలయ్యాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఎల్లో అలర్డ్ జారీ చేసారు. 

1:17 PM IST:

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడు సొంత నియోజకవర్గంలో పర్యటనకు సిద్దమయ్యారు. ఎల్లుండి (గురువారం) కుప్పం వేదికగా మూడో విడత వైఎస్సార్‌ చేయూత పథకం నిధులను సీఎం విడుదల చేయనున్నారు. ఇందుకోసం కుప్పంలో వైసిపి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. 

12:10 PM IST:

ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడంతో సంకటపరిస్థితుల్లో వున్న గోవా కాంగ్రెస్ కు నూతన సీఎల్పీని నియమించింది అధిష్టానం. ఎమ్మెల్యే యూరి అలేమావో కు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. 

11:43 AM IST:

టిడిపి సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలు కొనసాగించాలంటూ టీడీపీ సభ్యుల డిమాండ్ చేస్తూ సభలోనే టిడిపి సభ్యులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేసారు. 

11:15 AM IST:

జగన్ సర్కార్ పాలనలో రాష్ట్రం అదోగతి పాలవుతోందని... ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారంటూ ఆరోపిస్తూ ప్రతిపక్ష టిడిపి నాయకులు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి టిడిపి నేతలు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో అసెంబ్లీ సమీపంలోని ఓ భవనం ఎక్కి ఆందోళన చేపట్టారు. ఇలా నిరసనకు దిగినవారిలో కాపు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ నాయకులు వున్నారు. వీరిని పోలీసులు బిల్డింగ్ పైనుంచి కిందకుదించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

10:16 AM IST:

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వివిధ పనులు చేపట్టి బిల్లులు రాక ఇబ్బందిపడుతున్న కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు. లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసి కార్యాలయం వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే వున్న పోలీసులు వారిని అడ్డుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  పెండింగ్ లో వున్న రూ.800 కోట్ల బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.  

9:36 AM IST:

నాలుగోరోజు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట స్పీకర్ తమ్మినేని సీతారాం క్వశ్చన్ అవర్ ప్రారంభించగానే వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని రాష్ట్రంలో విషజ్వరాల వల్ల మరణాలేవి సంబవించలేదని తెలిపారు. టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు మాట్లాడుతూ ఇటీవల వరదల సమయంలో సీఎం జగన్ ను కలిసిన చిన్నారి డెంగ్యూతో చనిపోయినట్లు వార్తలు వచ్చాయని గుర్తుచేసారు. ఇలా ప్రశ్నోత్తరాలతో సభ వాడివేడిగా సాగుతోంది. 

9:28 AM IST: