అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో బ్లూ టిక్ మార్క్‌ను పునరుద్ధరించినందుకు ట్విట్టర్ చీఫ్ ఎలోన్ మస్క్ ఉల్లాసంగా కృతజ్ఞతలు తెలిపారు.

ముంబై : బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో బ్లూ చెక్‌మార్క్‌ను పునరుద్ధరించినందుకు ట్విట్టర్ చీఫ్ ఎలోన్ మస్క్‌కి కృతజ్ఞతలు తెలిపారు. మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇంతకుముందు సెలబ్రిటీల ఖాతాలకు బ్లూ టిక్‌లను తీసివేసింది. బ్లూ టిక్ సేవలకోసం డబ్బులు చెల్లించాలని తెలిపింది. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలతో సహా సహా పలువురు ప్రముఖులు తమ బ్లూ టిక్‌లను కోల్పోయారు. 

ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తన బ్లూ టిక్కులు పునరుద్దరించాలని.. తాను డబ్బులు చెల్లించానని బ్లూ టిక్ తిరిగి ఇవ్వాలని ఫన్నీగా కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ కు బ్లూ టిక్ పునరుద్దరించారు. ట్విట్టర్‌లో ట్రేడ్‌మార్క్ బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్ తిరిగి వచ్చిన తర్వాత, తూర్పు ఉత్తరప్రదేశ్ మాండలికాన్ని ఉపయోగించి హిందీలో రాస్తూ సూపర్ స్టార్ అమితాబ్ శుక్రవారం మరో పోస్ట్ చేశాడు. బిగ్ బి "బిగ్ బ్రదర్" మస్క్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ 1994 చిత్రం మొహ్రాలోని తూ చీజ్ బాడీ హై మస్త్ మస్త్ పాటను కాస్త మార్చి రాసుకొచ్చారు. 

"హే మస్క్ సోదరా! మీకు చాలా ధన్యవాదాలు! నా పేరు ముందు బ్లూ టిక్ తిరిగొచ్చింది. ఈ సంతోషసమయంలో మీకు నేనేం చెప్పాలి సోదరా? నాకు పాట పాడాలనిపిస్తుంది.. వినడానికి ఇష్టపడతారా? సరే వినండి " తూ చీజ్ బడి హై మస్క్ మస్క్... తూ చిజ్ బడి హై మస్క్" అంటూ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…