Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ అవిశ్వాసానికి 50 మందికిపైగా మద్ధతు.. ఏమాత్రం స్పందించని టీఆర్ఎస్

అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతిస్తామని.. అవిశ్వాసం చర్చ ఎప్పుడనేది పదిరోజుల్లో ప్రకటిస్తానని సుమిత్రా మహాజన్ వెల్లడించారు. మరోవైపు అవిశ్వాసానికి ఎవరెవరు మద్ధతిస్తున్నారని.. అలాంటి వారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ కోరిన సందర్భంలో టీఆర్ఎస్ మౌనంగా ఉండిపోయింది. 

trs could not support for tdp no confidence motion

బడ్జెట్ సమావేశాల్లో మిస్సయినా ఈ సారి ఎలాగైనా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టే తీరాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం పార్టీ ఆ దిశగా మొదటి విజయం సాధించినట్లే కనిపిస్తోంది... పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.. ప్రశ్నోత్తరాల తర్వాత టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, తోట నర్సింహం, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ తెలిపారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతిస్తామని.. అవిశ్వాసం చర్చ ఎప్పుడనేది పదిరోజుల్లో ప్రకటిస్తానని సుమిత్రా మహాజన్ వెల్లడించారు. మరోవైపు అవిశ్వాసానికి ఎవరెవరు మద్ధతిస్తున్నారని.. అలాంటి వారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ కోరిన సందర్భంలో టీఆర్ఎస్ మౌనంగా ఉండిపోయింది.

అవిశ్వాసానికి మద్ధతుగా టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ పార్టీలకు చెందిన సుమారు 50 మందికి పైగా ఎంపీలు లేచి నిలబడ్డారు. కానీ అక్కడే ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవ్వరూ లేవలేదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవ్వడానికి ముందే తాము ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడుతున్నామని.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నామని దీనికి మద్ధతు ఇవ్వాలని పలువురు టీడీపీ ఎంపీలు .. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎంపీలను కలిశారు.

టీడీపీ చేసే పోరాటానికి తప్పకుండా మద్ధతు ఇస్తామని నాడు కేకే, జితేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. కానీ ఇవాళ మాత్రం మిన్నకుండిపోయారు.. ఈ అంశంపై తమ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అందువల్ల తాము లేచి నిల్చోలేదని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు ఎంఐఎం పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా అవిశ్వాసానికి మద్ధతుగా లేచి నిలబడటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios