త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. 48 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితా విడుదల..
ఫిబ్రవరి 16వ తేదీన జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో 48 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో 60 సీట్లు ఉన్నాయి.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. ఇందులో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌తో పాటు 11 మంది మహిళలు, ఇద్దరు ముస్లిం అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 15 మంది అభ్యర్థులు ఈ సారి కొత్తగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నవారే ఉన్నారు. అయితే ఈ అభ్యర్థుల పేర్లను కేంద్ర నాయకత్వం ఖరారు చేసిందని బీజేపీ వర్గాలు తెలిపినట్టు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.
రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరు మార్చిన కేంద్రం.. ఇకపై అది ‘‘అమృత్ ఉద్యాన్’’
కాగా ఈ జాబితాలో ఆరుగురు ఎమ్మెల్యేల పేర్లు లేవు. అరుణ్ చంద్ర భౌమిక్ (బెలోనియా), బిప్లబ్ ఘోష్ (మటాబరి), సుభాష్ దాస్ (నల్చార్), మిమి మజుందార్ (బదర్ఘాట్), బీరేంద్ర కిశోర్ డెబ్బర్మా (గోలఘాటి), పరిమళ్ డెబ్బర్మా (అంబాసా) మొదటి జాబితాలో పార్టీ పేర్కొనలేదు. ఈ జాబితాలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా ఉన్న భౌమిక్ ఇద్దరు ప్రముఖమైన అభ్యర్థులు.
మాణిక్ సాహా టౌన్ బోర్డోవాలి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గత ఏడాది మేలో అప్పటి ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ స్థానంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సాహాను బీజేపీ సీఎం సీటులో కూర్చోపెట్టింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాగే పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన భౌమిక్ ధన్ పూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి అప్పటి ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే సీపీఐ (ఎం) ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
లఖింపూర్ ఖేరీ హింస కేసు.. బెయిల్‌పై జైలు నుంచి ఆశిష్ మిశ్రా విడుదల
శుక్రవారం న్యూఢిల్లీలో బీజేపీలో చేరిన సీపీఐ (ఎం) ఎమ్మెల్యే మొబోషర్ అలీ ఉత్తర త్రిపురలోని తన పెట్ కైలాసహర్ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ రాజీబ్ భట్టాచార్జీ బనమాలిపూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ సీఎం దేబ్ 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు.
రాజస్థాన్ భరత్‌పూర్‌లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్.. ఆ విషయంలో రాని స్పష్టత..!
కాగా.. మరో 12 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను త్వరలో ప్రకటిస్తామని భట్టాచార్జీ తెలిపారు. మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)తో పార్టీ చర్చలు జరుపుతోందని చెప్పారు. కాగా.. రాష్ట్రంలో బీజేపీ-ఐపీఎఫ్‌టీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కంచుకోటగా భావించే త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీపీఐ(ఎం) రాష్ట్రాన్ని 25 ఏళ్ల పాటు నిరాటంకంగా పాలించింది. ఈ సారి సీపీఐ (ఎం) కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తోంది. 60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 30లోగా నామినేషన్లు స్వీకరించేందుకు చివరి తేదీగా ఉంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.