కర్నాటకలో జరిగిన ఓ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు విద్యార్థులతో సహా.. వారి మేనమామ కొడగులోని కోటే అబ్బి జలపాతంలో కొట్టుకుపోయారు. వారి మృతదేహాలను వెలికి తీశారు.
కర్నాటక : కర్నాటక, మడికేరి కొడగులోని Kote Abbi Falls వద్ద ఆదివారం సాయంత్రం Accident జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పర్యాటకులు గల్లంతయ్యారు. మృతులు శ్యామ్ (36), శ్రీ హర్ష (18), సాయి ఇంద్రనీల్ (16) అని పోలీసులు తెలిపారు. ఇందులో శ్యామ్ శ్రీహర్హ, సాయిలకు మేనమామ. ఆయన 15 ఏళ్లుగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
శ్రీ హర్ష, సాయి ఇంద్రనీల్ Telanganaకు చెందిన విద్యార్థులు. వేసవి సెలవులు కావడంతో వారి కుటుంబానికి చెందిన 13 మంది సభ్యులు పర్యటన నిమిత్తం కర్నాటకకు వచ్చారు. ప్రమాదం జరిగిన సాయంత్రం మడికేరి తాలూకా ముక్కోడ్లు సమీపంలోని కోటే అబ్బి జలపాతానికి చేరుకున్నారు. వీరిలో ముగ్గురూ నీళ్ళలో ఆడుకుంటున్నారు. ఇంతలో సాయి నీళ్లలోకి జారిపడ్డాడు. అతనికి పైకి లేచే పట్టు దొరకక మునిగిపోవడం ప్రారంభించడంతో, మిగిలిన ఇద్దరు అతడిని కాపాడడానికి ప్రవాహంలోకి దూకారు. అయితే, ప్రవాహం వేగంగా ఉండడంతో వారంతా అదుపు తప్పి నీటిలో మునిగిపోయారు.
ప్రమాదం విషయం తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది, మడికేరి రూరల్ పోలీసులు రంగంలోకి దిగి.. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కొంతమంది జీపు డ్రైవర్లు ముందుగానే పర్యాటకులను ప్రవాహంలోకి వెళ్లొద్దని.. ప్రమాదం అని హెచ్చరించినట్టు తెలిసింది. ఈ కుటుంబం తమ విహారయాత్రకోసం కుశాల్‌నగర్ సమీపంలో హోమ్‌స్టే లో రూమ్స్ బుక్ చేసినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, సిక్కింలో శనివారం రాత్రి ఘోర కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో థానేకు చెందిన బంగారు వ్యాపారి కుటుంబంతో పాటు చిన్నారుల స్నేహితుడు, కారు డ్రైవర్ కూడా మరణించారు. కోవిడ్ తర్వాత చాలా కాలంగా ఎదురుచూస్తున్న విహార యాత్రకు వెళ్లడానికి వీరు ఉత్సాహంగా బయలు దేరారని కుటుంబసభ్యులు తెలియజేశారు.
థానేలోని బంగారు వ్యాపారి సురేష్ పునమియా, అతని భార్య తోరల్ 37, వారి ఇద్దరు కుమార్తెలు, వారి 14 ఏళ్ల స్నేహితుడు సిక్కింలోని లోయలో పడి మరణించారు. లోయలో దాదాపు 400 అడుగుల లోతులోకి కారు దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించి.. కారులోని అందరు మరణించినట్లు కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు. శనివారంనాడు జరిగిన ఈ ప్రమాదంలో ఆ 14యేళ్ల స్నేహితుడు పునమియాలతో కలిసి వెడతానని పట్టుబట్టి మరీ వెళ్లాడని ఆయన కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జైన్ కమ్యూనిటీ-ఆధిపత్యం ఉన్న టెంభి నాకాలో ఉంటున్న కుటుంబం మే 26న థానే నుండి తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్, వ్యాపార సహోద్యోగులతో 10 రోజుల ఈశాన్య పర్యటనకు బయలుదేరిందని థానేకి చెందిన వారి బంధువులు తెలిపారు. “పిల్లలు తమ పరీక్షల తర్వాత, కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్ల అనంతరం చాలా గ్యాప్ తర్వాత ఈ ట్రిప్ కి వెడుతున్నందున్న చాలా ఉత్సాహంగా ఉన్నారని, ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేశారని వారు అంటున్నారు.
విహారయాత్రలో ఒకరోజు ముగిసి తిరిగి వారు తమ హోటల్‌కి తిరిగి వస్తుండగా సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వారి కారు మిగతావారి కార్లకంటే వెనక ఉంది. అయితే మిగతావారంతా హోటల్ కు చేరుకున్నా వీరు రాకపోవడంతో.. ఆ బృందంలోని ఇతర సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే కుదరలేదు. ఆ తరువాత కొద్దిసేపటికి ప్రమాదం గురించి తెలిసింది’’ అని కుటుంబ సభ్యుడు జితేంద్ర జైన్ తెలిపారు.
