Asianet News TeluguAsianet News Telugu

తొలి ట్రాన్స్‌జెండర్ గర్భిణి ప్రసవం.. నవజాత శిశువు పాపనా? బాబునా? వారేం చెబుతున్నారంటే?

కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్ పర్సన్ గర్భం దాల్చిన విషయం ఇటీవలే సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ వ్యక్తి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కోళికోడ్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌లో ఈ రోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ప్రసవించారు. అయితే, పాప లింగంపై ఆ ట్రాన్స్ దంపతులు కొంత కాలం గోపత్య వహిస్తామని వివరించారు.
 

transgender couple blessed with a baby in kerala on feb 8
Author
First Published Feb 8, 2023, 4:39 PM IST

కోళికోడ్: కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్ దంపతులు ఇటీవలే ప్రెగ్నెన్సీ గురించి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, వారు బేబీకి జన్మనిచ్చారు. కోళికోడ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఈ రోజు ఉదయం 9.30 గంటలకు బేబీని ప్రసవించినట్టు ట్రాన్స్ పార్ట్‌నర్ జియా పావల్ వెల్లడించారు. సీజెరియన్ ద్వారా ప్రసవం జరిగినట్టు తెలిపారు. ట్రాన్స్‌జెండర్లు అయిన జియా పావల్, జాహద్‌లు గత మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. 

నవజాత శిశువు ఆరోగ్యంగా ఉన్నదని, జాహద్ కూడా ఆరోగ్యంగా ఉన్నారని పావల్ తెలిపారు. అయితే, ఈ నవజాత శిశువు లింగం గురించి మాత్రం వారు వెల్లడించ నిరాకరించారు. ఆ బేబీ పాపనా? బాబునా? అనే విషయాన్ని వారు కొంతకాలం గోప్యంగానే ఉంచాలని అనుకుంటున్నట్టు తెలిపారు. సరైన సమయంలో పాపనా? బాబునా? అనే విషయాన్ని వెల్లడిస్తామని వివరించారు. 

Also Read: తల్లి దండ్రులు కాబోతున్న కేరళ ట్రాన్స్ జెండర్ జంట.. దేశం లోనే మొట్ట మొదటి సారి..

ఇటీవలే జియా పావల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రెగ్నెన్సీ గురించి ప్రకటన చేశారు. తన భాగస్వామి జాహద్ ఎనిమిది నెలల గర్భంతో ఉన్నారని తెలిపారు. నేను తల్లి కావాలని, అతను తండ్రి కావాలనుకున్న తమ కల సాకారం కాబోతున్నదని వివరించారు. జాహద్ కడుపు లో ఇప్పుడు ఎనిమిది నెలల పిండం ఉన్నదని తెలిపారు. భారత్‌లో ఒక ట్రాన్స్‌ మ్యాన్ గర్భం దాల్చడం ఇదే తొలిసారి అని తనకు తెలిసిందని వివరించారు.

జియా పావల్ నృత్యకారిణి,  తన ఇన్‌స్టాగ్రామ్‌లో గర్భంతో ఉన్న జహ్హాద్ తో తన ఫొటోను షేర్ చేశారు. జహ్హాద్ ఇప్పుడు ఎనిమిది నెలల గర్భంతో ఉన్నారని ప్రకటించారు. జియా పావల్ పురుషుడిగా పుట్టి స్త్రీగా లింగ మార్పిడి చేసుకున్నారు, జహ్హాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిపోయారు. వారిద్దరూ తమ పుట్టుకకు తమలోని మనిషికి తేడా తెలుసుకున్న తరువాత వారు యుక్త వయస్సులో కుటుంబాలను విడిచిపెట్టారు. “తల్లి కావాలనే నా కలను, తండ్రి కావాలనే అతని కలను సాకారం చేసుకోబోతున్నాం. ఎనిమిది నెలల పిండం ఇప్పుడు (జహాద్) కడుపులో ఉంది. మాకు ఉన్న సమాచారం ప్రకారం.. ఇది భారతదేశంలో మొదటి ట్రాన్స్ పర్సన్స్ గర్భం”అని పావల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios