Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్ లో కుప్పకూలిన ట్రైనీ విమానం.. ఓ పైలెట్ మృతి.. మరో పైలెట్ పరిస్థితి విషమం..

మధ్యప్రదేశ్ లో ఓ ట్రైనీ విమానం కుప్పకూలిపోయింది. ట్రైనీ పైలెట్ విమానం నడపగా.. సీనియర్ పైలెట్ గైడ్ చేశారు. అయితే దట్టమైన పొగమంచు పేరుకుపోయి ఉండటం వల్ల సరిగా కనిపించకపోవడంతో విమానం ఓ ఆలయ గోపురాన్ని ఢీకొట్టింది. 

Trainee plane crashed in Madhya Pradesh.. One pilot died.. Another pilot is in critical condition..
Author
First Published Jan 6, 2023, 5:15 PM IST

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, మరో ట్రైనీ పైలట్ పరిస్థితి విషమంగా ఉంది. గురువారం రాత్రి 11.30 నుంచి 12 గంటల మధ్య ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దట్టమైన పొగమంచు ఉండటం పేరుకుపోవడంతో దృశ్యమానత తక్కువగా ఉండటం వల్ల ఈ ఘటన సంభవించి ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

మూడు రోజుల్లో 44 మంది న్యాయమూర్తులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాం: సుప్రీంకోర్టులో కేంద్రం

ఈ ఘటన రేవా జిల్లాలోని చోర్హటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి గ్రామంలో జరిగింది. ప్లాటూన్ అనే కంపెనీ ఉమ్రీ విమానాశ్రయంలో శిక్షణను అందిస్తుంది. అయితే రాత్రి 11.30 గంటలకు పైలట్ కెప్టెన్ విమల్ కుమార్ పాట్నాకు చెందిన విద్యార్థి సోనూ యాదవ్‌కు శిక్షణ ఇచ్చేందుకు ఫ్లైట్ ను టేకాఫ్ చేశారు. అయితే దృశ్యమానత తక్కువగా ఉండటం వల్ల రేవాలని ఓ ఆలయ గోపురాన్ని ఢీకొట్టింది. ఈ సమయంలో భారీ పేలుడు సంభవించి విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రాంతంలోని ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు భయంతో బయటకు వచ్చారు. 

విమానం ఆలయం పైభాగాన్ని ఢీకొని ఇంటిపై పడి ఉండకపోతే ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని, ఎక్కువగా ప్రాణనష్టం జరిగేదని  స్థానికులు తెలిపారు. అయితే ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్న రేవా ఎయిర్‌స్ట్రిప్‌ను విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నారు. ఫాల్కన్ కంపెనీ రేవాలోని పైలట్ ట్రైనింగ్ సెంటర్‌లో ట్రైనీలకు శిక్షణ ఇస్తుంటుంది. ఇలా శిక్షణలో ఉన్న విమానానికే గురువారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది.

ఫ్రమ్ ది ఇండియా గేట్‌: కోడళ్ల మధ్య పోరు, యాక్షన్‌లో ఆమె మిస్సింగ్, ట్రోఫిపై మ్యాప్ కథేంటి..

అయితే ప్రస్తుతం ప్రమాదం జరిగిన విమానం ఏ రకానికి చెందినదనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాగా.. 5 నెలల క్రితం కూడా రాజస్థాన్‌లో వైమానిక దళానికి చెందిన మిగ్-21 బైసన్ (ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్) యుద్ధ విమానం కూలిపోయింది. అందులో మంటలు చెలరేగి దాదాపు అర కిలోమీటరు పరిధిలో శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్లిద్దరూ దుర్మరణం పాలయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios