Asianet News TeluguAsianet News Telugu

విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి అనుమానాస్ప‌ద మృతి.. హ‌ర్యానాలో ఘ‌ట‌న

ఒకే కుటుంబానికి చెందిన 6 గురు ఒకే సారి అనుమానస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో చోటు చేసుకుంది. 

Tragedy.. Suspicious death of six members of the same family.. Incident in Haryana
Author
First Published Aug 26, 2022, 2:51 PM IST

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్య‌క్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే వీరంతా ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని అంతా భావిస్తున్నారు. ఘ‌ట‌న స్థ‌లంలో సూసైడ్ నోట్ ల‌భించింది. మొద‌ట ఓ వ్య‌క్తి తన కుటుంబంలోని ఐదుగురికి విషం ఇచ్చి, ఆ తర్వాత అత‌డూ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని స్థానికులు చెబుతున్నారు.

అంబాలాలోని బలానా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా క‌ల‌క‌లం రేగింది. మృతులను 65 ఏళ్ల సంగత్ సింగ్, అతని భార్య మహీంద్రా కౌర్ (62), వారి కుమారుడు సుఖ్‌విందర్ సింగ్ (32), అత‌డి భార్య ప్రమీల (28), మ‌రో ఇద్ద‌రు మనవరాళ్లుగా  గుర్తించారు.

కింద పడుతున్న చెల్లెని కాపాడిన ఐదేళ్ల బుడతడు..!

కుటుంబ పెద్ద సుఖ్వీందర్ సింగ్ యమునానగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. కుటుంబంలోని స‌భ్యులెవ‌రూ నేటి ఉద‌యం ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వ‌చ్చింది. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడ‌గా షాకింగ్ కు గుర‌య్యారు. కుటుంబం మొత్తం అచేత‌న స్థితిలో ప‌డి ఉండ‌టం చూసి భయాందోళనకు గురయ్యారు. వెంట‌నే పోలీసుల‌కు సమాచారం అందించారు. 

వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అందరూ చనిపోయారని నిర్ధారించుకొని మృతదేహాలను అంబాలా సిటీలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. అక్క‌డ పోస్టుమార్టం నిర్వ‌హించారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ నిపుణుల బృందం సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుంది, ఆ నోట్ లో ల‌క్ష‌ల విలువైన లావాదేవీలకు సంబంధించిన వివ‌రాల‌ను పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కేసు ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. పోస్టుమార్టం నివేదిక‌, విచార‌ణ పూర్తి అయిన త‌రువాత ఈ మృతికి గ‌ల కార‌ణాలు తెలిసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకే రోజు మృతి చెంద‌టంతో గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. 

ఢిల్లీకి వెడుతున్నావ్ జాగ్రత్త.. అని భయపెట్టారు : వీడ్కోలు సమావేశంలో సీజేఐ ఎన్వీ రమణ..

తమిళనాడు రాష్ట్రంలో గతేడాది ఆగ‌స్గు నెల‌లో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేస‌కుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు ఒకే సారి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. వివరాల్లోకి ఇలా ఉన్నాయి. కృష్ణగిరి జిల్లా హోసూరులో మోహన్ తన కుటుంబంతో నివాసం ఉండేవారు. ఆయ‌న త‌న త‌ల్లి వసంత (61), భార్య రమ్య (36), కొడుకు అన్వయ్ (10)తో క‌లిసి జీవించేవారు. అయితే మోహన్ కు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడడం వ్యసనంగా మారింది. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ అందులో డబ్బులు పెట్టేవాడు. ఇలా ఆడుతూ ఉండ‌టం వ‌ల్ల త‌న చేతిలోని డ‌బ్బులు అన్నీ అయిపోయాయి. అనంత‌రం ఇతరుల దగ్గర అప్పు తీసుకొని కూడా ఆట‌లు ఆడేవాడు. ఇలా చేసిన ల‌క్ష‌లాది రూపాల‌యి అప్పు చేశాడు. ఆన్ లైన్ ర‌మ్మీ ద్వారా డ‌బ్బులు తిరిగిరాక‌పోవ‌డం, అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి తీసుకురావ‌డం వ‌ల్ల మానసికంగా కృంగిపోయాడు. దీంతో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. 

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios