Asianet News TeluguAsianet News Telugu

విషాదం.. వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ బోల్తా, 34 మంది మృతి..

హిందూ మహాసముద్రంలో ఓ పడవ బోల్తా పడటంతో 34 మంది చనిపోయారు. ఈ పడవలో ప్రయాణిస్తున్న వారంతా వలస కూలీలే. వీరు మడగాస్కర్‌లోని మయోట్‌కి అక్రమంగా ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో 24 మంది సురక్షితంగా బయటపడ్డారు. 

Tragedy.. Migrant workers' boat capsizes, 34 killed..
Author
First Published Mar 16, 2023, 8:54 AM IST

మడగాస్కర్‌లోని మయొట్టేకు వెళ్లేందుకు హిందూ మహాసముద్రంలో వలస కూలీలతో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న వారంతా మునిగిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు అక్కడి అధికారులు 34 మృతదేహాలను వెలికితీశారు. 58 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవ అధికారిక ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కంట్రోలర్స్ ను దాటకుండా రహస్యంగా ప్రయాణించిందని, మడగాస్కర్ వాయువ్య తీరంలో శనివారం రాత్రి మునిగిపోయిందని మలగాసి సముద్ర అధికారులు తెలిపారు.

ఒకే బిల్డింగులో 24 గంటల్లో ఇద్దరి ఆత్మహత్య.. అసలేం జరిగింది...?

కస్టమ్స్, నేవీ గస్తీ పడవలు నోసీ ఫాలీ ద్వీపం సమీపంలో మృతదేహాలను వెలికితీశాయని పోర్టు, మారిటైమ్ అండ్ ఫ్లూవియల్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జీన్ ఎడ్మండ్ రాండ్రియానెనా తెలిపారు. బాధితులు ప్రధానంగా అంబిలోబ్, తమటావే, మజుంగా, నోసీ బీ ప్రాంతాలకు చెందినవారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ దుర్ఘటనపై యావత్ రాష్ట్ర యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, దర్యాప్తును వేగవంతం చేయడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని అన్నారు. 

పడవలో బోల్తా పడటంతో స్థానిక మత్స్యకారులు సహాయక చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. ఇలా 24 మందిని వారు కాపాడారని, కానీ ప్రాణాలతో బయటపడిన వారిలో ఒక్కరు తప్ప మిగితా అందరూ తమను అరెస్టు చేస్తారనే భయంలో ఒడ్డుకు చేరుకున్న తరువాత అధికారులు రాకముందే పారిపోయారని తెలిపారు. అధికారులకు చిక్కిన ఓ మహిళ గర్భవతి అని, కీలక సాక్షిగా ఉన్న ఆమె ప్రస్తుతం అంబిలోబ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోందని పేర్కొన్నారు.

గీజర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి.. దంపతులు మృతి, కొడుకుకు అస్వస్థత...

కాగా.. అక్రమంగా వలస కార్మికులను తరలిస్తున్న స్మగ్లర్లుగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి, మహిళ కోసం అధికారులు గాలిస్తున్నారు. అక్రమంగా బోర్డింగ్, రహస్య రవాణా, మయొట్టేకు ప్రయాణికులను అసంకల్పితంగా హతమార్చడం వంటి నేరాల కింద వీరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. 

ఈ ప్రమాదంపై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి రోజర్ చార్లెస్ ఎవినా మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ సముద్రంలో జరిగిన ఈ దుర్ఘటనలపై అధికారిక జాతీయ గణాంకాలు లేవని తెలిపారు. కానీ ఇవి నిజంగా తరచూ రహస్యంగా జరుగుతూ ఉంటాయని తెలిపారు. వాటి అంతిమ గమ్యస్థానం ఎక్కువగా మయోట్టే అని తాము గమనిస్తున్నామని చెప్పారు. 

ఉద్యమం మరింత ఉధృతం.. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక: అస్సాం సీఎం

మయోట్టే అనేది చిన్న ద్వీపాల పేద ద్వీపసమూహం అయినప్పటికీ, ఇది ఫ్రెంచ్ భూభాగం. ఇది మడగాస్కర్ నుంచి వచ్చే వలసదారులకు ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. కాగా.. మడగాస్కర్ నుంచి ఈ అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఐఓఎం కొన్ని నెలలుగా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios