Asianet News TeluguAsianet News Telugu

టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ మృతి.. జపాన్ కంపెనీని దేశానికి తీసుకొచ్చిన వ్యాపారవేత్త పూర్తి వివరాలు

టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ వైస్ చైర్మన్ విక్రమ్ ఎస్ మరణించారు. 64 ఏళ్ల వయస్సులో గుండెపోటు రావడంతో ఆయన బెంగళూరులో ఆయన చనిపోయారు. ఆయన మృతి పట్ల కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం ప్రకటించారు. 

Toyota Kirloskar Vice Chairman Vikram passed away.. Full details of the businessman who brought the Japanese company to the country
Author
First Published Nov 30, 2022, 9:47 AM IST

టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ వైస్ చైర్మన్, భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమలో అతిపెద్ద దిగ్గజాలలో ఒకరైన విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ (64) మంగళవారం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. యూఎస్ లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుండి ఇంజనీరింగ్ పట్టా పొందిన కిర్లోస్కర్.. 1990ల చివరలో జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కార్ప్‌ను భారతదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

స్నేహమంటే మనదేరా అంటున్న కోతి, పిల్లి.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో..!

1888లో ప్రారంభమైన కిర్లోస్కర్ గ్రూప్‌లో ఆయన  నాలుగోతరం సభ్యుడు. విక్రమ్ కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాడు.  కిర్లోస్కర్ గ్రూప్ ఎక్కువగా పంపులు, ఇంజన్లకు సంబంధించిన ఉత్పత్తులతో పాటు కంప్రెసర్‌లను తయారు చేస్తుంది.

కర్ణాటకలోని బెంగళూరు నివాసి అయిన విక్రమ్.. టయోటా గ్రూపులో భాగస్వామిగా ఉంటూ, ఆ రాష్ట్రంలో ఒక పెద్ద ఆటోమొబైల్ తయారీ పరిశ్రమను ప్రారంభించడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నారు. ఆయన కృషిని గుర్తించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘సువర్ణ కర్ణాటక’ అనే అవార్డును ప్రదానం చేసింది.

ఫిరోజాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. 6 గురు సజీవదహనం, మృతుల్లో ముగ్గురు చిన్నారులు..

కాగా.. టయోటా ఇండియా అధికారిక ట్విట్టర్ అకౌంట్ తెలిపిన వివరాల ప్రకారం.. విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ అంతిమ సంస్కారాలు బుధవారం బెంగళూరులోని హెబ్బాల్ శ్మశానవాటికలో జరుగుతాయి. మంగళవారం ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ ట్వీట్ చేసింది. ‘‘ నవంబర్ 29, 2022న టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ మిస్టర్ విక్రమ్ ఎస్. కిర్లోస్కర్ అకాల మరణం గురించి తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాం. ఈ దుఃఖ సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాలని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాం ’’ అని ఆయన తెలిపారు.

విక్రమ్ కిర్లోస్కర్ మరణం పట్ల కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై  సంతాపం తెలిపారు. “భారత ఆటోమోటివ్ పరిశ్రమ ప్రముఖులలో ఒకరైన టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ అకాల మరణం పట్ల హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఈ నష్టాన్ని తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్న. ఓం శాంతి” అని ఆయన ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios