Top 10 Telugu News @ March 5th 2024: టాప్ టెన్ తెలుగు వార్తలు.. 

Top 10 Telugu News: శుభోదయం..ఇవాళ్టీ telugu.asianetnews టాప్ 10 తెలుగు వార్తలలో   "ఆ సమయం సరిపోదు.. గడువు పెంచండి..": సుప్రీం కోర్టుకు ఎస్‌బీఐ వినతి.., ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్ , అవినీతి కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు వినహాయింపు లేదు: సుప్రీం సంచలన తీర్పు ,ఈసారి జగన్‌కు ఓటమి తప్పదు : ప్రశాంత్ కిశోర్ , నలుగురు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.., హైదరాబాద్లో ప్రధాని మోడీ పర్యటన వంటి వార్తల సమాహారం. 

todays top ten news on asianet news on march 5th KRJ   

Top 10 Telugu News:  (పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)

"ఆ సమయం సరిపోదు.. గడువు పెంచండి..": సుప్రీం కోర్టుకు ఎస్‌బీఐ వినతి..
 
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ 'రాజ్యాంగ విరుద్ధం' అని సుప్రీం కోర్టు పేర్కొంది . ఎలక్టోరల్ బాండ్ల నుండి వచ్చిన విరాళాల గురించి సమాచారాన్ని పంచుకోవాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఇందుకోసం ఎస్‌బీఐ బ్యాంకుకు 2024 మార్చి 6 వరకు కోర్టు గడువు ఇచ్చింది. ఇప్పుడు దీనిపై ఎస్‌బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి.. గడువు పొడిగించాలని కోరింది.

ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్ 
 
ISRO: ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన రోజే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్‌ ఉన్నట్టు తెలిసింది. టార్మాక్ మీడియా హౌజ్‌లో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సోమనాథ్ వెల్లడించారు. ఓ స్కాన్‌లో క్యాన్సర్ వ్రణం పెరుగుదలను గుర్తించినట్టు చెప్పారు. 

అవినీతి కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు వినహాయింపు లేదు: సుప్రీం సంచలన తీర్పు
  
లంచం కేసుల్లో  ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు సోమవారం నాడు సంచలన తీర్పును వెల్లడించింది.  గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది.  ప్రజా ప్రతినిధులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. లంచం కేసులో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు తెలిపింది.చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకొంటే రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.ఈ విషయమై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఏపీలో వైసీపీదే పైచేయి.. టీడీపీకి ఎన్ని సీట్లు?.. ఒపీనియన్ పోల్ అంచనాలివే
 
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నట్టు తాజాగా వెలువడ్డ ఒపీనియన్ పోల్ అంచనాలు తెలిపాయి. ఈ ఒపీనియన్ పోల్ అంచనాలు కేవలం లోక్ సభ ఎన్నికల పైనే వచ్చాయి. అయితే.. గతంలో కంటే ఎంపీ సీట్ల సంఖ్య తగ్గుతుందని చెప్పినా.. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కంటే ఎక్కువ సీట్లే గెలుచుకుంటుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.

ఈసారి జగన్‌కు ఓటమి తప్పదు : ప్రశాంత్ కిశోర్ సంచలనం

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, జగన్ ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారని దాని వల్ల ఓట్లు పడవన్నారు.  తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కూడా అదే కారణమన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమన్న పీకే.. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఈసారి ఏం చేసినా జగన్ గెలవడం కష్టమని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.


నలుగురు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..

వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నది. తొలిగా ఈ పార్టీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితకు బీఆర్ఎస్ మరో ఛాన్స్ ఇచ్చింది. నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి, మాలోతు కవిత మహబూబాబాద్ నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్లో ప్రధాని మోడీ పర్యటన.

PM Modi: రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. నిన్న ఉదయం ఆదిలాబాద్ కు చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ మోదీ పర్యటనలో నిఘా పటిష్టం చేశారు పోలీసులు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ జంక్షన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, యశోద హాస్పిటల్ మార్గంలో దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ డైవెర్షన్స్ తో పాటు ప్రధాని వెళ్లే పలు రూట్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


డీఎస్పీల బదిలీల పర్వం..  

DSP Transfers: సార్వత్రిక ఎన్నికల వేళ  తెలంగాణలో మరోసారి పోలీసు శాఖలో బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో పనిచేస్తున్న 47 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికల వేళ ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేశారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. గత నెలలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది. 

IPL 2024: "కొత్త సీజన్‌.. కొత్త రోల్‌.." ధోనీ పోస్టు వైరల్.. 

IPL 2024: భారత మాజీ క్రికెటర్  కీలక ప్రకటన చేశాడు. చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలోకి తిరిగి వచ్చిన ఆయన ఓ ప్రత్యేక పోస్ట్‌ను పెట్టి అభిమానులను హడలెత్తించారు. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో చెన్నై తరఫున కొత్త 'పాత్ర'లో ప్రవేశించేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తన పోస్ట్‌లో రాశాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా? మెంటార్‌గా చేస్తాడా? అనే కామెంట్స్ వెల్లువెత్తున్నాయి.

యూపీ వారియర్స్ దూకుడుకు బెంగళూరు బ్రేక్ 

 WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ 11వ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో యూపీ వారియర్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. యూపీని 23 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో మంధాన జట్టు ముందడుగు వేసింది. టాస్ గెలిచిన యూపీ తొలుత ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మంధాన, పెర్రీల అర్ధ సెంచరీల ఆధారంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 175 పరుగులు చేయగలిగింది. ఇలా హ్యాట్రిక్‌పై కన్నేసిన ఆ జట్టును 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

రాడిసన్​ డ్రగ్​ కేసులో కీలక పరిణామం..   
 
Director Krish: ఇటీవల డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు సినీ దర్శకుడు క్రిష్ అలియాస్ రాధాకృష్ణ జాగర్లమూడి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టులో రెండు రోజుల క్రితం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డైరెక్టర్ సోమవారం ఉపసంహరించుకున్నారు. వాస్తవానికి కేసు నమోదైన వెంటనే జాగర్లమూడి క్రిష్​ ముంబయి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇలా తనను నిందితుడిగా పేర్కొన్న వెంటనే క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios