March 19-Top Ten News: టాప్ టెన్ వార్తలు
ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు ఇవే.
తెలంగాణకు కొత్త గవర్నర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త గవర్నర్ ను కూడ రాష్ట్రపతి నియమించారు. పూర్తి కథనం
మ్మెల్సీ కవితకు నేను బెయిల్ ఇప్పించగలను
ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయంగా పోరాడితే తాను ఈ రోజే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించగలనని అన్నారు. సీబీఐ, ఐటీ సోదాల భయం ఎవరికి ఉన్నా.. వారు తన వద్దకు రావొచ్చని పిలుపు ఇచ్చారు. పూర్తి కథనం
గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ అన్వేషణ
తెలంగాణలో పెండింగ్ లోని 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది.ఇవాళ ఈ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది. పూర్తి కథనం
బాపట్ల హై వే పై యుద్ధ విమానం
బాపట్ల హై వే పై యుద్ధ విమానం ఎలా దిగిందో చూడండి. పూర్తి కథనం
చంద్రబాబుకు ఈసీ నోటీసులు
తెలుగు దేశం పార్టీకి ఈసీ ఝలక్ ఇచ్చింది. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై అభ్యంతరకర పోస్టులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయరాదని, ఇది వరకే ఉన్న అభ్యంతరకర పోస్టులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. పూర్తి కథనం
మోదీకి నారీ శక్తి ఆహ్వానం
సేలం లో ప్రధాని మోదీకి నారీ శక్తి విభిన్న రీతిలో ఆహ్వానం. పూర్తి కథనం
కేంద్ర మంత్రి పదవికి పశుపతి రాజీనామా
రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధినేత, పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ సీట్ల సర్దుబాటు విషయంలో తనకు, తన పార్టీకి అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. పూర్తి కథనం
విచారణకు రావాలని రాందేవ్‌కు సుప్రీం ఆదేశం
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు ప్రముఖ యోగా గురురు రామ్ దేవ్ బాబా, పంతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ పై మండిపడింది. తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. పూర్తి కథనం
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కుట్ర.. ఆమ్ ఆద్మీ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఈడీ బీజీపీకి పొలిటికల్ వింగ్ ల పని చేస్తోందని ఆరోపించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఒక కుట్ర అని విమర్శించింది. పూర్తి కథనం
'పాకిస్థాన్ స్మోకింగ్ లీగ్..'
Imad Wasim : కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫైనల్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ గెలుపుతో మూడో పీఎస్ఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే, మ్యాచ్ జరుతుండగానే ఇమాద్ వసీ స్మోకింగ్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. పూర్తి కథనం