Asianet News TeluguAsianet News Telugu

Earthquake: లడఖ్‌లో భూకంపం.. 3.4 తీవ్రత నమోదు

Ladakh Earthquake: లేహ్, లడఖ్ రెండూ ప్రాంతాలు దేశంలోని సిస్మిక్ జోన్ - 4 లో ఉన్నాయి. అంటే భూకంపాల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ. టెక్టోనికల్ యాక్టివ్ హిమాలయ ప్రాంతంలో ఉన్న లేహ్, లడఖ్ లలో తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి.
 

Todays Earthquakes: 3.4 scale quake hits Ladakh, india, 5.8 quake hits Dhaka, Bangladesh RMA
Author
First Published Dec 2, 2023, 11:54 AM IST

Ladakh Earthquake: లడఖ్‌లో శనివారం రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకారం, ఈ ప్రాంతంలో ఉదయం 8.25 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం 35.44 అక్షాంశం, 77.36 రేఖాంశంలో 10 కిలో మీట‌ర్ల లోతులో కేంద్రీకృత‌మై ఉంది. "భూకంపం తీవ్రత: 3.4, 02-12-2023న లాడ‌ఖ్ లో ప్ర‌కంప‌న‌లు సంభవించాయి. 08:25:38 IST, లాట్: 35.44 & పొడవు: 77.36, లోతు: 10 కిలో మీట‌ర్లు  స్థానం: లడఖ్" అని ఎన్సీఎస్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.

 

లేహ్, లడఖ్ రెండూ దేశంలోని సిస్మిక్ జోన్ -4 లో ఉన్నాయి, అంటే భూకంపాల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ. టెక్టోనికల్ యాక్టివ్ హిమాలయ ప్రాంతంలో ఉన్న లేహ్, లడఖ్ లలో తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. గ‌తంలో సంభ‌వించిన భూ ప్ర‌కంప‌న‌ల నేప‌థ్యంలో చేసిన ప‌రిశోధ‌న‌లో టెక్టోనిక్ సెటప్‌కు సంబంధించిన శాస్త్రీయ ఇన్‌పుట్‌ల ఆధారంగా దేశంలోని భూకంపాలకు గురయ్యే ప్రాంతాల్లో వీటిని గుర్తించారు. 

బంగ్లాదేశ్ లోనూ భూ ప్ర‌కంప‌న‌లు.. 

బంగ్లాదేశ్ లో శ‌నివారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. కుమిల్లాలోని రామ్ గంజ్ లో ఉదయం 9:35 గంటలకు ఢాకా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని బంగ్లాదేశ్ వాతావరణ శాఖకు చెందిన వాతావరణ నిపుణుడు రుబాయెత్ కబీర్ తెలిపిన‌ట్టు 'ది డైలీ స్టార్' నివేదించింది.

రిక్ట‌ర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.5గా నమోదైందనీ, పెద్ద‌గా ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగలేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందనీ, రామ్ గంజ్ కు తూర్పు ఈశాన్యంగా 8 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించిన‌ట్టు యూఎస్ జీఎస్ తెలిపింది.

చటోగ్రామ్, సిరాజ్గంజ్, నార్సింగి, సిల్హెట్, ఖుల్నా, చాంద్ పూర్, మదారిపూర్, రాజ్షాహి, బ్రహ్మన్బారియా జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ప్ర‌కంప‌న‌లు క్ర‌మంలో ఏం జ‌రుగుతుందోన‌ని ప్ర‌జ‌లు ఇండ్లు, ఆఫీసుల నుంచి బ‌ట‌కు ప‌రుగులు తీశారు. భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios