Asianet News TeluguAsianet News Telugu

Today's Top Stories: బ్రిటన్‌ రాజుకి క్యాన్సర్.. నెహ్రూపై మండిపడ్డ ప్రధాని మోడీ.. హీరో అక్షయ్ డీప్ ఫేక్ వైరల్

Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  బ్రిటన్‌ రాజుకి క్యాన్సర్.., భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్, బాల్క సుమన్‌పై కేసు నమోదు,సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ, రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ వార్నింగ్, మరోసారి నెహ్రూపై మండిపడ్డ ప్రధాని మోడీ , హీరో అక్షయ్ కుమార్  డీప్ ఫేక్ వీడియో హల్ చల్.., రేవంత్ సర్కార్ పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు, మరోసారి బాబు, పవన్ భేటీ.. బీజేపీతో పొత్తు ఉంటుందా?వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టాలి: చంద్రబాబు..వంటి వార్తల సమాహారం. 

Today top stories top 10 Telugu news Andhra Pradesh Telangana FEBRUARY 6th headlines krj
Author
First Published Feb 6, 2024, 6:59 AM IST

Today's Top Stories:  

King Charles III: బ్రిటన్‌ రాజుకి క్యాన్సర్.. 

King Charles III: బ్రిటన్‌ రాజు  కింగ్ చార్లెస్ III  సంబంధించిన ఓ కీలక వార్త వెలుగులోకి వచ్చింది. కింగ్ చార్లెస్(75) III క్యాన్సర్‌ తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ సోమవారం (ఫిబ్రవరి 5) ప్రకటించింది. ABC న్యూస్ ప్రకారం.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కింగ్ చార్లెస్ III పరీక్షలు నిర్వహించగా.. ఆ వైద్య పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కి  క్యాన్సర్ ఉందన్న వార్తతో అతని మద్దతుదారులు బాధపడ్డారు. రాజుకు సంబంధించిన అన్ని పబ్లిక్ ఫంక్షన్లను రద్దు చేయాలని వైద్యులు సూచించారు. అయితే, కింగ్ చార్లెస్ ఏ రకమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నారో స్పష్టంగా తెలియలేదు.

H-4 Visa: భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్ ..

H-4 Visa: అమెరికాలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు శుభవార్త చెప్పింది. హెచ్‌-1బీ వీసాదారులపై ఆధారపడే వారి భాగస్వామి, పిల్లలకు ఉద్యోగాలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హెచ్‌-4 వీసా ఉన్న డిపెండెంట్లకు ఆటోమేటిక్‌గా ‘వర్క్‌ ఆథరైజేషన్‌’ వర్తించేలా కీలక బిల్లు ఆమోదం తెలిపింది. 

బాల్క సుమన్‌పై కేసు నమోదు.

Balka Suman: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్‌లో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని దూషిస్తూ.. చెప్పుతో కొడతానంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  బాల్క సుమన్‌ పై స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు 

సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ

 తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సోమవారంనాడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కోరుతూ ఇప్ప‌టికే పీసీసీ తీర్మానించిన విష‌యాన్ని ఆయ‌న సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.  తెలంగాణ ఇచ్చిన త‌ల్లిగా రాష్ట్ర ప్ర‌జ‌లు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పారు. స్పందించిన సోనియా గాంధీ స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న హామీల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోనియాగాంధీకి వివరించారు. ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌లకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

రేవంత్ సర్కార్ పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు
 
తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ ) ఎంపీ   విజయసాయి రెడ్డి ఆరోపించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  సోమవారం నాడు  వైఎస్ఆర్‌సీపీ  తరపున ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై  విజయసాయి రెడ్డి  విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన చేసినా కూడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదన్నారు.  రాష్ట్ర విభజన జరిగిన  పదేళ్ల తర్వాత  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.  తెలంగాణలో  అబద్దపు హామీలు ఇవ్వడంతోనే  తెలంగాణలో ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు.  త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  కూలిపోతుందని  ఆయన  చెప్పారు. 

మరోసారి బాబు, పవన్ భేటీ.. బీజేపీతో పొత్తు ఉంటుందా?

జనసేన టిడిపిలో మధ్య సీట్ల పంచాయతీ తేలడం లేదు. ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి-జనసేన ఉమ్మడిగా  కూటమిగా వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే టిడిపి మండపేట, అరకు రెండు స్థానాల్లో అభ్యర్థులను విడిగా ప్రకటించింది. దీంతో జనసేన కూడా రాజానగరం,  రాజోలు మరో రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది.  మరోవైపు వైసీపీ ఇప్పటికే 85 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీద ఉంది.


వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టాలి: చంద్రబాబు

రాష్ట్రంలోని  మూడు ప్రాంతాల ప్రజలు ఫ్యానుకు ఉన్న 3 రెక్కలను ముక్కలుగా విరగొట్టాలని చంద్రబాబు కోరారు.బాదుడే బాదుడు అనే రెక్కను పీకడానికి కోస్తా ప్రజలు, హింస, దోపిడీ రెక్కను తుక్కుతుక్కు చేయడానికి రాయలసీమ ప్రజలు, మొండి ఫ్యానును జగన్ చేతికి ఇచ్చి వైసీపీని బంగాళాఖాతంలో విసిరేయడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధం కావాలని చంద్రబాబు కోరారు. అనకాపల్లి జిల్లా మాడుగుల, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో సోమవారం రా..కదలిరా బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.ఎన్నికలకు సిద్ధం అని జగన్ తన సభల్లో అంటున్నారు..కానీ ఓటమి భయంతో పూర్తిగా సందిగ్ధంలో ఉన్నాడని తెలుగు దేశం పార్టీ  నారా చంద్రబాబు నాయుడు  విమర్శించారు.  జగన్ టికెట్లు ఇస్తున్నా పోటీకి అభ్యర్థులు దొరకడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ వార్నింగ్..


Election Commission: దేశంలో త్వరలో సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలు (Parliament Elections 2024) నగరా మోగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను  జారీ చేసింది. కమిషన్ జారీ చేసిన కొత్త ఉత్తర్వు ప్రకారం.. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారం, ర్యాలీలలో పిల్లలను ఉపయోగించడాన్ని నిషేధించాలని కోరింది. 

మరోసారి నెహ్రూపై మండిపడ్డ ప్రధాని మోడీ 

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పార్లమెంటులో మాట్లాడుతూ మరోసారి నెహ్రూపై మండిపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై విరుచుకుపడ్డారు. గతంలో వారు ఇచ్చిన ప్రసంగాల్లోని మాటలను ఉటంకిస్తూ విమర్శలు చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీలకు భారతీయుల శక్తి సామర్థ్యాలపై విశ్వాసం లేదని అన్నారు. ‘భారత ప్రజల శక్తియుక్తులను కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువగానే చూసింది. తాము పాలకులం.. మిగిలిన ప్రజలు వారికంటే తక్కువ వారే అనే కోణంలో చూసేవారు’ అని ప్రధాని మోడీ అన్నారు.

హీరో అక్షయ్ కుమార్  డీప్ ఫేక్ వీడియో హల్ చల్..

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా టెక్నాలజీలో గొప్ప ఆవిష్కరణలు కొత్త సవాలును ఎదుర్కొంటున్నాయి. వీటిలో డీప్ ఫేక్ వీడియో భారతదేశంలో ఆందోళన వాతావరణాన్ని సృష్టిం స్తుంది. డీప్ ఫేక్ వీడియోను కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. రష్మిక మందన్న, టేలర్ స్విఫ్ట్, కత్రినా కైఫ్ సహా కొంతమంది ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి, వీటిపై  కేసు కూడా రిజిస్టర్  చేయబడింది. ఇప్పుడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వంతు వచ్చింది. అక్షయ్ కుమార్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. గేమ్ అప్లికేషన్ ద్వారా ప్రచారం చేయబడిన వీడియో చాలా వాస్తవికంగా సృష్టించబడింది, అయితే దీనిని నకిలీ వీడియో అని  కూడా గుర్తించలేరు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios