నేడు ‘బ్లాక్ ఫ్రై డే’.. ఎందుకో తెలుసా ?

ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించాలని రైతులు చేస్తున్న నిరసనల్లో ఓ యువ రైతు మరణించారు. దీంతో ఆయనను అమరుడిగా ప్రకటించాలని కోరుతూ, దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరుతు రైతు సంఘాలు నేడు ‘బ్లాక్ డే’ నిర్వహించాలని పిలుపునిచ్చాయి.

Today is 'Black Friday Day'. Do you know why? ..ISR

ఎంఎస్పీకి చట్టబద్దతతో పాటు పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రైతులు చేస్తున్న నిరసనలో అపశృతి చోటు చేసుకుంది. పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలోని ఖనౌరీ బోర్డర్ క్రాసింగ్ వద్ద ఓ రైతు మరణించారు. ఇది హత్యేనని ఆరోపిస్తూ, నేడు ‘బ్లాక్ ఫ్రైడే’ నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చిందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ గురువారం తెలిపారు.

MLA Lasya Nanditha : బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

అలాగే నేడు దేశ రాజధాని వైపు హైవేలపై సంయుక్త కిసాన్ మోర్చా ట్రాక్టర్ మార్చ్ కూడా నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు.  ఈ నెల 26న ట్రాక్టర్లను హైవేపైకి, ఢిల్లీకి వెళ్లే మార్గంలో తీసుకెళ్తామని రాకేశ్ టికాయత్ తెలిపారు. ఆ కార్యక్రమం అయిన తరువాత భారతదేశమంతటా సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మరో కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దానిని ట్రాక్టర్లు లేకుండా వెళ్తామని అన్నారు. ప్రభుత్వం తమను ఆపడం లేదని చెబుతోందని, ఆ రోజు ఆపుతారో లేదో చూద్దామని అన్నారు. 

తండ్రి మరణంతో రాజకీయాల్లోకి.. కానీ అంతలోనే.. యువ ఎమ్మెల్యే లాస్య నందిత నేపథ్యమిదీ..

కాగా.. ఢిల్లీ చలో నిరసనల సందర్భంగా పంజాబ్ లోని బఠిండాకు చెందిన యువరైతు శుభకరణ్ సింగ్ (21) మృతి చెందారు. దీంతో నిరసన తెలుపుతున్న రైతులు సమావేశం నిర్వహించారు. ఇది కచ్చితంగా హత్యే అని, దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని రైతు సంఘాల నాయకుల డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబానికి కోటి రూపాయిల నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. ఆయనను అమరుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు హర్యానాలోని శంభు సరిహద్దులో కొనసాగుతున్న పరిస్థితిని సమీక్షించడానికి రైతులు తమ 'ఢిల్లీ చలో' నిరసన ర్యాలీని రెండు రోజుల పాటు నిలిపివేశారని  పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి గురువారం తెలిపారు. ఈ సమీక్ష అనంతరం తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 2020-21లో రైతులు ఇలాగే పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios