జార్ఖండ్ హేమంత్ సోరెన్ ప్రభుత్వం నేడు విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. దీని కోసం ఆ రాష్ట్ర అసెంబ్లీని నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాయ్‌పూర్ రిసార్ట్‌లో ఉన్న యూపీఏ ఎమ్మెల్యేలు నిన్న సొంత రాష్ట్రానికి చేరుకున్నారు.
జార్ఖండ్ లో నెల కొన్న రాజకీయ గందరగోళ పరిస్థితుల మధ్య నేడు జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఛత్తీస్ ఘడ్ లోని రాయ్‌పూర్ రిసార్ట్‌లో పని చేసిన ఆ రాష్ట్రానికి చెందిన యూపీఏ ఎమ్మెల్యేలు ఆదివారం తిరిగి రాంచీకి చేరుకున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందని, తన ఎమ్మెల్యేలను లాగేసుకుంటుందనే భయంతో సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలను నవ రాయ్‌పూర్‌లోని రిసార్ట్ కు తరలించింది.
వధువుకు కన్యత్వ పరీక్ష.. ఫెయిలయ్యిందని రూ.10లక్షల జరిమానా.. ఆ తరువాత...
రాంచీకి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలతో హేమంత్ సోరెన్ ఆదివారమే సమావేశమయ్యారు. ఆ ఎమ్మెల్యేలు రాత్రిపూట సర్క్యూట్ హౌస్‌లో గడిపారు. నేడు సమావేశం జరిగే సమయానికే అక్కడి నుంచి బయలుదేరనున్నారు. కాగా ఎమ్మెల్యేలకు పంపిన లేఖ ప్రకారం సీఎం తన మెజారిటీని నిరూపించుకోవడానికి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. జార్ఖండ్ సీఎం సోరెన్ ఎమ్మెల్యేగా కొనసాగడంపై ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ కూడా సభలో తన వ్యూహాన్ని రూపొందించడానికి ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలంగీర్ ఆలం మాట్లాడుతూ.. “జార్ఖండ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. మా ప్రతినిధి బృందం గవర్నర్‌ను (గురువారం) కలిసింది. ఒకటి లేదా రెండు రోజుల్లో గందరగోళాన్ని క్లియర్ చేస్తామని ఆయన మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. అందుకే అసెంబ్లీలో మా అంశాలను లేవనెత్తి మెజారిటీని నిరూపించుకుంటాం. ’’ అని ఆయన పేర్కొన్నారు.
సైరస్ మిస్త్రీ మృతి : ప్రమాద సమయంలో అతివేగంతో కారు నడిపింది ఆమెనట..!
ఇదిలా ఉండగా.. జార్ఖండ్ యూపీఏ ఎమ్మెల్యేలకు తన రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తూ జార్ఖండ్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కొట్టిపారేశారు. రాయ్ పూర్ లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో జార్ఖండ్ యూపీఏ ఎమ్మెల్యేలకు సంబంధించి అడిగిన ప్రశ్నకు బఘేల్ స్పందిస్తూ.. ‘‘ ఎవరినైనా (జార్ఖండ్ ప్రభుత్వం) రక్షించడానికి నేను ఎవరు? ... వారు నా రాష్ట్రంలో అతిథులు. ’’ అని ఆయన అన్నారు. జార్ఖండ్‌లోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం బీజేపీ ‘‘గుర్రపు వ్యాపారం’’ వ్యూహాల దృష్ట్యా, వేట నుంచి వారిని రక్షించడానికి తమ ఎమ్మెల్యేలను రాయ్‌పూర్‌కు తరలించిందని సీఎం బఘేల్ పేర్కొన్న కొన్ని రోజుల తరువాత ఈ కామెంట్స్ వచ్చాయి.
టీచర్స్ డే: నేడు మూడు రీసెర్చ్ గ్రాంట్లు, రెండు ఫెలోషిప్ స్కీములు ప్రవేశపెట్టనున్న యూజీసీ
కొన్ని రోజుల కిందట రాయ్‌పూర్‌లోని మేఫెయిర్ రిసార్ట్‌లో జార్ఖండ్ యూపీఏ ఎమ్మెల్యేలను బఘెల్ కలిశారు. రాయ్‌పూర్‌కు వెళ్లిన వారిలో నలుగురు మంత్రులు, జేఎంఎంకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు సహా కాంగ్రెస్‌కు చెందిన 13 మంది ఉన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార కూటమి సిద్ధంగా ఉందని సీఎం హేమంత్ సోరెన్ రాంచీ విమానాశ్రయంలో మీడియాకు తెలిపారు.
