Asianet News TeluguAsianet News Telugu

టీచర్స్ డే: నేడు మూడు రీసెర్చ్ గ్రాంట్లు, రెండు ఫెలోషిప్ స్కీములు ప్రవేశపెట్టనున్న యూజీసీ

టీచర్స్ డే 2022 సందర్భంగా యూజీసీ ఈ రోజు ఐదు ఫెలోషిప్ స్కీములను ప్రవేశపెట్టబోతున్నది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు యూజీసీ ట్విట్టర్, యూట్యూబ్ చానెళ్లలో లైవ్ వెబ్ క్యాస్టింగ్ ఉండనుంది. ఈ ఫెలోషిప్‌లతో ముఖ్యంగా ఉపాధ్యాయులు పరిశోధనలపై ఫోకస్ చేయడానికి సహకరించనుంది.
 

UGC to launch five fellowship schemes on teachers day 2022
Author
First Published Sep 5, 2022, 3:42 AM IST

న్యూఢిల్లీ: ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా యూనివర్సటీ గ్రాంట్స్ కమిషన్ ఓ కీలక ప్రకటన చేయనుంది. టీచర్స్ డే సందర్భంగా ఈ రోజు కొత్తగా మూడు రీసెర్చ్ గ్రాంట్లు, రెండు ఫెలోషిప్ స్కీమ్‌లను ప్రవేశపెట్టునుంది. ఈ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు యూజీసీ ట్విట్టర్, యూట్యూబ్ చానెళ్లలో లైవ్ వెబ్ క్యాస్ట్ కానుంది.

యూజీసీ వెల్లడించిన వివరాల ప్రకారం, మూడు రీసెర్చ్ గ్రాంట్లు సర్వీసులో ఉన్న టీచర్ల, ఫ్యాకల్టీ  సభ్యులకు వర్తిస్తాయి. ఇందులో 100 స్లాట్లు ఉంటాయి. ఈ ఫెలోషిప్‌కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెల వారీగా రూ. 50 వేలు అందుతాయి. ఏడాదికి మరో రూ. 50 వేలు అందుతాయి. 

అభ్యర్థి వయసు 67 ఏళ్లకు మించరాదు. కనీసం పది మంది ఫుల్ టైమ్ క్యాండిడేట్ల పీహెచ్‌డీ థీసిస్‌లకు పర్యవేక్షణ చేసి ఉండటం తప్పనిసరి. ఇందులో కనీసం ముగ్గురు గత పదేళ్లలోనే డిగ్రీలు చేసి ఉండాలి. అంతేకాదు, అభ్యర్థి కచ్చితంగా జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలు ఫైనాన్స్ చేసిన కనీసం మూడు రీసెర్చ్ ప్రాజెక్టులకు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరించి ఉండాలి. అలాగే, ఫెలో షిప్ కాలమంతా వారు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలేవీ తీసుకోరాదు. 

1. ఇన్ సర్వీస్ ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్
ఈ స్కీమ్ ద్వారా ఫ్యాకల్టీ మెంబర్లుగా అపాయింట్ అయిన వారికి పరిశోధనలపై అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద రూ. 10 లక్షల ఆర్థిక సహకారం 200 మంది సెలెక్ట్ అయిన  పార్టిసిపేంట్లకు దక్కుతుంది.

2. డాక్టర్ డీఎస్ కొఠారీ రీసెర్చ్ గ్రాంట్
సైన్స్, మెడిసిన్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన అభ్యర్థులకు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ ప్లాన్ ఇదీ. దీని ద్వారా 132 మంది ఎంపికైన అభ్యర్థులకు రూ. 10 లక్షల సహకారం అందుతుంది.

3. రిటైర్డ్ ఫ్యాకల్టీకి ఫెలోషిప్
రిటైర్‌ మెంట్ తర్వాత కూడా బోధనలో, పరిశోధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రిటైర్డ్ బోధకుల కోసం యూజీసీ ఈ స్కీమ్ ప్రవేశ పెడుతున్నది. దీనికి 100 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేలు, ఏడాదికి రూ. 50 వేల చొప్పున మూడేళ్లు అందిస్తారు. 

4. డాక్టర్ రాధాకృష్ణన్ యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్
ఈ స్కీం కింద 900 సీట్లు అందుబాటులో ఉంచనుంది. అయితే, ఇందులో 30 శాతం మహిళా అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంచింది. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50వేలు, ఏడాదికి రూ. 50వేలు అందిస్తుంది.

5. సింగిల్ గర్ల్ చైల్డ్‌ కోసం సావిత్రిబాయి జోతిరావ్ ఫూలే ఫెలోషిప్
ఈ ఫెలో షిప్ ఎంతమందికి అందించాలనే నిబంధన ఏమీ లేదు. సింగిల్ గర్ల్స్‌ను ఎంకరేజ్ చేయడానికి యూజీసీ ఈ స్కీం ప్రవేశ పెడుతున్నది. వారు తమ చదువులు, పరిశోధనలు కొనసాగించి అంతిమంగా అవి వారి పీహెచ్‌డీ కి ఉపయోగపడేలా చేయాలని యోచిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios