దీక్ష విరమించిన కేజ్రీవాల్, ఢీల్లీలో పరిస్థితులు చక్కబడేనా?

First Published 19, Jun 2018, 6:39 PM IST
To Resolve Delhi Deadlock, Lt Governor's Go Ahead For Meeting: 10 Facts
Highlights

ఆప్ ఎమ్మెల్యేలు, కేజ్రీవాల్  దీక్ష విరమణ


ఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో 9 రోజులుగా దీక్ష చేసిన న్యూఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నాడు సాయంత్రం తన దీక్షను విరమించారు. 
ఐఎఎస్ అధికారులు సమ్మెను విరమించేలా ఆదేశాలు జారీ చేయాలనే డిమాండ్‌ చేస్తూ  కేజ్రీవాల్‌ సహా మంత్రులు ఢిల్లీ లెఫ్టినెంట్ కార్యాలయంలో దీక్షకు దిగారు.

  అయితే లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఈ మేరకు  చర్యలు  అవసరమైన చర్యలు తీసుకోవడంతో  దీక్ష విరమించేందుకుగాను ఆప్ సంసిద్దతను వ్యక్తం చేసింది. ఈ మేరకు దీక్షలో ఉన్న సీఎ: కేజ్రీవాల్ సహా, ఆప్  ఎమ్మెల్యేలు కూడ దీక్షను విరమించారు.

అందరు ఐఏఎస్ అధికారులు తిరిగి విధుల్లో చేరినట్లు అనిల్ బైజాల్ లేఖ రాయడంతో కేజ్రీవాల్ తన ధర్నాను విరమించాలని నిర్ణయించుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విలేకర్ల సమావేశంలో తెలిపారు. మంత్రులు నిర్వహించిన అన్ని సమావేశాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సంబంధిత ఐఏఎస్ అధికారులు హాజరైనట్లు అనిల్ తన లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఐఏఎస్ అధికారులంతా విధులకు హాజరవుతారని అనిల్ బైజాల్ హామీ ఇచ్చారన్నారు.

అయితే ఢిల్లీ ప్రభుత్వం నుంచి తమకు రక్షణ కల్పించాలని ఐఏఎస్ అధికారులు కోరినట్లు సమాచారం.కేజ్రీవాల్‌తో తన నివాసంలో చర్చలు జరిపేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నిరాకరించినట్లు సమాచారం. సచివాలయంలో చర్చలు జరుపుదామని లెఫ్టినెంట్ గవర్నర్ కోరారని సమాచారం. మరోవైపు మంత్రులతో సమావేశానికి ఐఎఎస్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీక్షలో ఉన్న కేజ్రీవాల్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడ దీక్ష విరమించారు.

లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఈ సమస్య పరిష్కరం కోసం ప్రయత్నం చేశారు. మంగళవారం నాడు ఉదయం కేజ్రీవాల్ మరోసారి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోడీని కోరారు.  అయితే సాయంత్రానికి ఈ సమస్య పరిష్కారం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ చొరవ తీసుకొన్నారు. దీంతో  సమస్య పరిష్కారమైంది.

సెక్రటేరియట్‌లో ఐఎఎస్ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్ ను కోరారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలతో చర్చించారు. ఇరువర్గాలు ఈ సమస్య పరిష్కారం కోసం  మెట్టుదిగొచ్చాయి. దరిమిలా కేజ్రీవాల్ సహ ఆప్ ఎమ్మెల్యేలు దీక్షను విరమించారు. లెఫ్టినెంట్ గవర్న్ కార్యాలయంలో దీక్షను ఎలా చేస్తారని  సీఎం కేజ్రీవాల్ పై సోమవారం నాడు ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
 

loader