ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వస్త్రధారణపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కొత్త ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర సంస్కృతిని, దేశ సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులనే ధరించాలని పళనిస్వామి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు గౌరవప్రదమైన వస్త్రధారణలో ఉండాలని సూచించింది.

 ఈ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ మహిళా ఉద్యోగులు చీరలు, సల్వార్ కమీజ్, పంజాబీ డ్రెస్‌తో హుందాతనం ఉట్టిపడేలా వస్త్రధారణ ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ఇక పురుషులు కూడా.. ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్.. అవి కూడా తమిళనాడు సంస్కృతిని, భారతీయ సంస్కృతిని తెలియజేసేవిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.