Asianet News TeluguAsianet News Telugu

ప్రీ వెడ్డింగ్ షూట్‌లో ధూమ్ సినిమానే దించేశారు.. బైక్ పై స్టంట్ చేసిన పెళ్లి జంట (వీడియో)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ప్రీ వెడ్డింగ్ కోసం పెళ్లి జంట భారీ స్టంట్ చేస్తున్నట్టు కనిపించింది. బైక్ పై కూర్చుని ఉండగా.. క్రేన్ తాళ్లు ఆ బైక్‌ను అక్కడే ఉన్న కారు మీది నుంచి అటు వైపుకు దింపుతున్నది.
 

to be married couples pre wedding shoot bike stunt video viral
Author
First Published Oct 27, 2022, 3:50 PM IST

న్యూఢిల్లీ: పెళ్లి అంటే నూరేళ్ల పండుగ అంటారు. ఈ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని చాలా మంది తహతహలాడుతుంటారు. ఇందుకోసం వినూత్న దారుల్లో వెళతారు. కొందరు పాట్లు పడితే.. మరికొందరు ఫ్లాట్ అయ్యేలా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు పెళ్లి వేడుకలో ప్రీ వెడ్డింగ్ షూట్ తప్పనిసరి క్రతువుగా మారిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్‌కు కూడా యూత్ హై ప్రయారిటీ ఇస్తున్నారు. సాహసోపేత స్టంట్లు చేయడానికీ వెనుకాడటం లేదు. తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఓ జంట తమ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో ఏకంగా బైక్ ను కారు మీది నుంచే దూకించే స్టంట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నది.

పెళ్లి చేసుకోబోతున్న జంట బైక్ పై కూర్చుని గాల్లోకి లేస్తున్నారు. క్రేన్ తాడులతో ఆ బైక్‌ను నిజమైన స్టంట్‌‌గా కనిపించేలా గాల్లోకి లేపుతున్నది. ఆ వీడియో బైక్ గాల్లోకి లేచే స్పాట్ దగ్గర ఓ బండరాయిని కూడా పెట్టారు. బహుశా ఆ బండరాయిని తాకి బైక్ గాల్లోకి లేచేలా సీన్ చేస్తున్నట్టుగా అర్థం అవుతున్నది. ఆ బైక్ ఎదురుగా ఓ కారు ఉన్నది. పెళ్లి చేసుకునే జంట ఆ బైక్ పై కూర్చోగా.. క్రేన్ తాడులతో ఆ బైక్‌ను కారు మీది నుంచి పోనిస్తున్నారు. కారుకు అటు వైపున ఆ బైక్‌ను ల్యాండ్ చేశారు. 

ఈ క్లిప్‌ను ఇప్పటికే ట్విట్టర్‌లో 2.60 లక్షల మంది వీక్షించారు. చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. ఒకరైతే.. ఇలా స్టంట్ చేయకుంటే నేను పెళ్లే చేసుకోనూ అంటూ భీష్మించుకున్నాడు. ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్ లేకున్నా.. పెళ్లి చేసుకుంటారా? అంటూ మరొకరు వ్యంగ్యం పోయారు. కాగా, ఇంకొందరు.. తమ పెళ్లిలోనూ ఈ స్టంట్ చేసే తీరుతామని పేర్కొన్నారు. 

Also Read: 'ఫైర్ హెయిర్ క‌ట్' అన్నాడు.. చివ‌ర‌కు నెత్తిని కాల్చేశాడు.. ! వైర‌ల్ వీడియో

మరికొందరు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌ను రోహిత్ షెట్టి డైరెక్ట్ చేస్తున్నారా? అంటూ జోక్ చేశాడు. ఇండియన్స్ ఏమైనా చేస్తారు? అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ భారీ ఈవెంట్‌కు ఎంత ఖర్చైందో? అంటూ ఒక యూజర్ అడిగాడు. ఇది ప్రీవెడ్డింగ్ షూటా.. లేక సినిమా షూటా? అంటూ ఒకరు సందేహం వెలిబుచ్చారు.  కొందరైతే.. ఇది ధూమ్ 4 సినిమా అంటూ కామెంట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios