Asianet News TeluguAsianet News Telugu

'ఫైర్ హెయిర్ క‌ట్' అన్నాడు.. చివ‌ర‌కు నెత్తిని కాల్చేశాడు.. ! వైర‌ల్ వీడియో

Fire Haircut: ఈ మ‌ధ్య కాలంలో హెయిర్ క‌టింగ్స్ చాలా ర‌కాలుగా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే అదిరిపోయే స్టైల్లో త‌న ఎయిర్ క‌టింగ్ ఉండాల‌ని కోరిన ఒక యువ‌కుని "ఫైర్ హెయిర్ క‌టింగ్" కాస్తా అత‌ని త‌ల కాలిపోయే ప్ర‌మాదానికి సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. 
 

Gujarat : young Man Suffers Burns After 'Fire Haircut' Goes Wrong At Salon In Vapi town
Author
First Published Oct 27, 2022, 3:15 PM IST

Gujarat: గుజ‌రాత్ లో ఓ షాకింగ్ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఒక యువ‌కుడు సెలూన్ కు క‌టింగ్ చేయించుకోవ‌డానికి వెళ్లి.. త‌న ప్రాణాల మీద‌కు ప్ర‌మాదాన్ని కొని తెచ్చుకున్నాడు. త‌న త‌ల‌ను కాలిపోయే ప్ర‌మాదంలో పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, ఈ దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. ఈ మ‌ధ్య కాలంలో హెయిర్ క‌టింగ్స్ చాలా ర‌కాలుగా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే అదిరిపోయే స్టైల్లో త‌న ఎయిర్ క‌టింగ్ ఉండాల‌ని కోరిన ఒక యువ‌కునికి "ఫైర్ హెయిర్ క‌టింగ్" చేస్తుండ‌గా అనుకోని ప్ర‌మాదం జ‌రిగింది. అత‌ని  త‌ల కాలిపోయే ప్ర‌మాదానికి సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం ఆ యుకుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. 

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణంలోని సెలూన్‌లో 18 ఏళ్ల యువకుడు స్టైలిష్ గా క‌నిపించ‌డానికి "ఫైర్ హెయిర్‌కట్" చేయించుకోవ‌డానికి వెళ్లాడు. ఫైర్ హెయిర్ క‌టింగ్ ఈ మ‌ధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఫైర్ హెయిర్ క‌టింగ్ అంటే.. త‌ల‌పై ఉన్న హెయిర్ కు కొన్ని ర‌సాయ‌నాలు పూసి.. వెంట్రుక‌ల‌కు నిప్పు అంటించి హెయిర్ క‌ట్ చేస్తారు. ఈ స‌మ‌యంలో ఎలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అయితే, గుజార‌త్ సెలూన్ లో ఫైర్ హెయిర్ క‌ట్ క్ర‌మంలో ప్ర‌మాదం చోటుచేసుకుంది. యువ‌కుని ప్రాణాల మీద‌కు తెచ్చింది. వెంట్రుక‌ల‌తో పాటు అత‌ని త‌ల కూడా కాలిపోయింది.  తప్పుగా కాలిన గాయాలకు గురయ్యాడని పోలీసులు గురువారం తెలిపారు. బాధితుడికి త‌ల‌పైనా మాత్ర‌మే కాకుండా అత‌ని ఛాతీ, మెడ‌ స‌హా ఇత‌ర శ‌రీర భాగాల‌పై గాయాలు అయ్యాయి.

 

త‌ల‌పై మంట‌ల‌ను ఆర్ప‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. ఆవి ఆర‌కుండా.. మ‌రింతా పెరిగాయి. దీంతో ఆ యువ‌కునికి గాయాలు అయ్యాయి. బుధ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బాధితుడిని వాపిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, గాయాలు తీవ్రంగా కావ‌డంతో అతన్ని వల్సాద్‌లోని సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వాపి టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. వాపిలోని భడక్‌మోరా ప్రాంతానికి చెందిన బాధితుడు సుల్పాడ్ ప్రాంతంలోని సెలూన్‌లో "ఫైర్ హెయిర్‌కట్" కోసం వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు, అలాగే, సెలూన్ నిర్వాహ‌కుని వాంగ్మూలాల‌ను తీసుకునే ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ద‌ని పోలీసు దర్యాప్తు అధికారి కరమ్‌సిన్హ్ మక్వానా తెలిపారు.

"బాధితుడి వాంగ్మూలాన్ని రికార్డు చేయ‌డానికి ప్రయత్నిస్తున్నాము. అతన్ని వల్సాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుండి సూరత్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు మాకు స‌మాచారం అందింది" అని మక్వానా చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, హెయిర్‌కట్ కోసం అతని తలపై ఒక రకమైన రసాయనాన్ని పూయడంతో బాధితుడి శరీర పైభాగాలు తీవ్రంగా కాలిపోయాయని పోలీసు అధికారులు తెలిపారు. అలాగే, ఫైర్ హెయిర్ క‌టింగ్ కోసం ఏ రసాయనాన్ని ఉపయోగించారనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios