Asianet News TeluguAsianet News Telugu

సీఎంగా స్టాలిన్ ప్రమాణం: ఐదు కీలక అంశాలపై సంతకాలు చేసిన తమిళనాడు సీఎం

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడ కరోనా చికిత్సపై ప్రభుత్వ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను వర్తింపజేస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకొన్నారు. ముఖ్యమంత్రిగా శుక్రవారం నాడు ఉదయం ఆయన ప్రమాణం చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఈ ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. 
 

TN govt health insurance applicable for COVID treatment at private hospitals: CM Stalin lns
Author
Chennai, First Published May 7, 2021, 3:46 PM IST

చెన్నై: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడ కరోనా చికిత్సపై ప్రభుత్వ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను వర్తింపజేస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకొన్నారు. ముఖ్యమంత్రిగా శుక్రవారం నాడు ఉదయం ఆయన ప్రమాణం చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఈ ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఐదు కీలక అంశాలపై  స్టాలిన్ సంతకం చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని  వైద్యానికి అయ్యే ఖర్చును తగ్గించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర భీమా పథకం కింద ప్రజల వైద్యం ఖర్చును తమిళనాడు సర్కార్ భరించనుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కూడ ఈ ఇన్సూరెన్ కింద ఖర్చులు  భరించవచ్చు.

also read:తమిళనాడుకు 14వ సీఎం: ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణం

కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి రూ. 4వేలు ఆర్ధిక సహాయం అందించనున్నట్టుగా స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలోని 2.07 కోట్ల కుటుంబాలకు రూ. 4 వేల చొప్పున ఆర్ధిక సహాయం ఇవ్వనున్నారు. తొలి విడతగా  ఈ మాసంలో రూ. 2 వేలు అందించనున్నారు. ఈ ఫైలుపై కూడ ఆయన సంతకం చేశారు. లీటరు పాల ధరను రూ. 3 తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.  మే 8వ తేదీ నుండి  విద్యార్థులు, మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని స్టాలిన్ సూచించారు. ప్రత్యేకమైన ఫిర్యాదుల కోసం 100 రోజుల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios