Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడుకు 14వ సీఎం: ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణం

తమిళనాడు సీఎంగా ఎంకె స్టాలిన్ శుక్రవారంనాడు ప్రమాణం చేశారు. గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్  స్టాలిన్ తో  ప్రమాణం చేయించారు. 

MK Stalin  sworn in as Tamilnadu Chief minister lns
Author
Chennai, First Published May 7, 2021, 9:16 AM IST

చెన్నై: తమిళనాడు సీఎంగా ఎంకె స్టాలిన్ శుక్రవారంనాడు ప్రమాణం చేశారు. గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్  స్టాలిన్ తో  ప్రమాణం చేయించారు. స్టాలిన్ తో పాటు మరో 34 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కరుణానిధి మంత్రివర్గంలో  పనిచేసిన వారికి స్టాలిన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇవాళ ఉదయం రాజ్‌భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ తో పాటు మరో 33 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కరుణానిది మంత్రివర్గంలో  మంత్రులుగా పనిచేసిన దురైమురుగన్ లాంటి సీనియర్లతో పాటు  12 మంది కొత్తవారికి కూడ స్టాలిన్ తన మంత్రివర్గంలో  చోటు కల్పించారు. 

 

ఇవాళ ఉదయం రాజ్‌భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ తో పాటు మరో 33 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కరుణానిది మంత్రివర్గంలో  మంత్రులుగా పనిచేసిన దురైమురుగన్ లాంటి సీనియర్లతో పాటు  12 మంది కొత్తవారికి కూడ స్టాలిన్ తన మంత్రివర్గంలో  చోటు కల్పించారు. తమిళనాడు సీఎంగా స్టాలిన్ తొలిసారిగా ప్రమాణం చేశారు. పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్, అఖిలభారత సేవలు, జిల్లా రెవిన్యూ అధికారులు, ప్రత్యేక కార్యక్రమాల అమలు, వికలాంగుల సంక్షేమంతో హోం శాఖలు స్టాలిన్ తన వద్ద ఉంచుకొన్నారు. 2006-11 వరకు డిఎంకె పాలనలో  ప్రజా పనుల వంటి బాధ్యతలు స్వీకరించిన దురైమురుగన్ కు ఈ దఫా నీటిపారుదల, గనుల వంటి శాఖలను కేటాయించారు. చెన్నై మాజీ మేయర్ సుబ్రమణియన్ పికె శేఖర్ బాబు తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios