రాజ్యసభలో ఇవాళ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  దీంతో  రాజ్యసభ నుండి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ను  సస్పెండ్  చేశారు రాజ్యసభ చైర్మెన్

న్యూఢిల్లీ: రాజ్యసభ నుండి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ను రాజ్యసభ చైర్మెన్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. రాజ్యసభలో ఇవాళ గందరగోళ వాతావరణం నెలకొంది. మణిపూర్ అంశంపై విపక్షాలు తమ నిరసనను కొనసాగించారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరో మూడు రోజుల పాటు మాత్రమే జరగనున్నాయి. ఈ సమయంలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెన్షన్ కు గురయ్యారు.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆప్ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ ను కూడ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.టీఎంపీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ నిరంతరం డిస్టర్బ్ చేస్తున్న నేపథ్యంలో సస్పెన్షన్ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశ పెట్టారు.