నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఉపఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రెండు సీట్లను టీఎంసీకి అర్పించుకోవడమే కాదు.. మూడు చోట్ల డిపాజిట్లూ గల్లంతయ్యాయి. టీఎంసీకి పార్టీ నుంచి వలసలు పెరిగిన తరుణంలో ఈ ఉపఎన్నిక కీలకమని కమలంపార్టీ భావించింది. కానీ, టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన నాలుగు ఉపఎన్నికల్లో అధికారపార్టీ తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో రెండు BJP స్థానాలనూ తన ఖాతాలో వేసుకున్నట్టయింది. దిన్హాతా, గోసాబా, ఖర్దాహ్, శాంతిపూర్ నియోజకవర్గాలకు Bypolls జరిగాయి. ఇందులో గత అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ గెలిచిన స్థానాలూ ఉన్నాయి. దిన్హతా, శాంతిపూర్ నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకుంది. కానీ, తాజాగా, జరిగిన ఉపఎన్నికల్లో ఈ రెండు స్థానాలు సహా గోసాబా, ఖర్దాహ్‌లనూ టీఎంసీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. అంతేకాదు, ఈ నాలుగు చోట్లా మొత్తం కలిపి TMC 75శాతం ఓటు షేర్‌ను సాధించింది. కాగా, బీజేపీ మూడు చోట్లా Deposits కోల్పోయింది.
గతంలో బీజేపీ గెలుచుకున్న దిన్హతా స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహా 1.63 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గోసాబా స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రతా మోండల్ 1.43 లక్షల ఓట్లతో విజయం సాధించారు. శాంతి పూర్‌లో 64వేల ఓట్ల మెజార్టీతో, ఖర్దాహ్‌లో 93వేల ఓట్ల మెజార్టీతో అధికార పార్టీ విజయపతాకాన్ని ఎగరేసింది.
గెలుపొందిన అభ్యర్థులకు West Bengal సీఎం Mamata Banerjee అభినందనలు తెలిపారు. ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. దుష్ప్రచారం, విద్వేష రాజకీయాలకు బదులు పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధినే ఎంచుకుంటారని ట్వీట్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఎప్పట్లాగే రాష్ట్రాన్ని మరిన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తామని హామీనిచ్చారు.
Also Read: Bypoll Results 2021: బీజేపీకి భంగపాటు?.. పశ్చిమ బెంగాల్‌లో ఆ రెండు సీట్లూ టీఎంసీ ఖాతాలోకి..!
బీజేపీ నుంచి టీఎంసీకి మళ్లీ వలసలు మొదలైన నేపథ్యంలో ఈ ఉపఎన్నికలో గెలవడం కమలం పార్టీకి అత్యావశ్యకమైంది. కానీ, ఈ నాలుగు స్థానాల్లో అంటే, బీజేపీకి కంచుకోటగా భావించే కూచ్‌బెహార్ పరిధిలోని దిన్హాతాలోనూ పరాజయం పాలవ్వడంతో పార్టీవర్గాలు నిరాశలో మునిగాయి.
పశ్చిమ బెంగాల్‌లో నాలుగు స్థానాల్లో Bypolls జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న రెండు స్థానాల్లోనూ పోలింగ్ జరిగింది. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిశిత్ ప్రమాణిక్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో దిన్హాతా సీటులో ఉపఎన్నిక అనివార్యమైంది. మరో శాంతిపూర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ రాజీనామా చేశారు. అందులోనూ నిశిత్ ప్రమాణిక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన దిన్హాతా బీజేపీకి కంచుకోటగా భావించే కూచ్‌బెహార్‌కు చెందినదే.
భవానీపూర్‌లో గెలుపొంది రాజీనామా చేసిన టీఎంసీ ఎమ్మెల్యే సోవందేబ్ ఛటోపాధ్యాయ్.. ఖర్దాహ్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ మళ్లీ పోటీ చేయడానికి భవానీపూర్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు.
గత నెల 30వ తేదీన అసోంలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, West Bengal లో నాలుగు స్థానాలు,. మధ్యప్రదేశ్ లో మూడు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, బీహార్ రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాలు, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, తెలంగాణలోని ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.
Also Read: హర్యానా ఎల్లెనాబాద్ ఉపఎన్నికలో ‘రైతుల విజయం’.. ఆరువేల మెజార్టీతో అభయ్ గెలుపు
దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్ లోని మండి, మధ్యప్రదేశ్ లోని ఖండ్వా ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
