టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నగదుకు-ప్రశ్న ఆరోపణలు: లోక్ సభ సభ్యత్వం రద్దు
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ నుండి బహిష్కరణకు గురయ్యారు. ఎథిక్స్ కమిటీ సిఫారసు మేరకు లోక్ సభ ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: టీఎంసీ పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా లోక్ సభ నుండి బహిష్కరణకు మహువా మొయిత్రాపై లోక్ సభ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్ సభ శుక్రవారంనాడు ఆమోదించింది. మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం కూడ రద్దు చేశారు..
డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు అడిగారని మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ నిర్వహించింది. ఎథిక్స్ కమిటీ చైర్మెన్ వినోద్ కుమార్ సోంకర్ ఇవాళ నివేదికను సమర్పించారు.ఈ నివేదికను లోక్ సభ ఇవాళ ఆమోదించింది. ఇవాళ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో లోక్ సభ వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే ఎథిక్స్ కమిటీ నివేదికను సోంకర్ ప్రవేశ పెట్టారు.
also read:మహువా మొయిత్రాపై నగదుకు-ప్రశ్నల ఆరోపణలు: బహిష్కరణకు ఎథిక్స్ కమిటీ సిఫారసు
ఈ నివేదికను లోక్ సభ ఆమోదించింది. అయితే ఈ విషయమై టీఎంసీ ఎంపీ మహువా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని టీఎంసీలు కూడ డిమాండ్ చేశారు. మరో వైపు టీఎంసీ ఎంపీల డిమాండ్ కు ఇతర విపక్షాలు కూడ మద్దతు పలికారు. విపక్షాల నిరసనల మధ్యే మహువా బహిష్కరణకు లోక్ సభ ఆమోదం తెలిపింది.మహువా బహిష్కరణ తర్వాత లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ నుండి బహిష్కరణకు గురయ్యారు.నగదుకు-ప్రశ్నలు అనే ఆరోపణలతో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ మహువాపై విచారణ నిర్వహించింది.ఈ మేరకు ఎథిక్స్ కమిటీ ఇవాళ పార్లమెంట్ కు నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్ సభ నుండి మహువాను బహిష్కరణ అస్త్రం ప్రయోగించారు. అంతేకాదు ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని కూడ రద్దు చేశారు.
మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. విపక్ష పార్టీల ఎంపీలు లోక్ సభ నుండి వాకౌట్ చేశారు. మరో వైపు ఈ విషయమై టీఎంసీ ఎంపీ సుధీప్ బందోపాధ్యాయ స్పందించారు. మహువా మొయిత్రాపై సభ్యత్వం రద్దు చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా తమ గొంతు నొక్కుతున్నారని ఆయన విమర్శించారు.