Asianet News TeluguAsianet News Telugu

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జేమ్స్ బాండ్‌తో పోల్చిన టీఎంసీ ఎంపీ

బీజేపీ అంటే మండిపడే త‌ృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వరల్డ్ ఫేమస్ స్పై ఏజెంట్ క్యారెక్టర్ జేమ్స్ బాండ్‌తో పోల్చారు. జేమ్స్ బాండ్ ముఖం స్థానంలో ప్రధానమంత్రి మోడీ ముఖాన్ని ఉంచిన ఓ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, అసలు కథ వేరే ఉన్నది.
 

tmc mp compares pm modi with james bond
Author
New Delhi, First Published Oct 19, 2021, 10:17 PM IST

న్యూఢిల్లీ: Prime Minister Narendra Modiని ఇంగ్లాండ్ ప్రముఖ స్పై చిత్ర కథానాయకుడు James Bondతో ప్రతిపక్ష నేత పోల్చారు. సోషల్ మీడియాలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ఓ పోస్టు పెట్టారు. టీఎంసీ ఎంపీ ఒబ్రియన్ కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేసిన చరిత్ర ఉన్నవారు. అలాంటిది ప్రధాని మోడీని వరల్డ్ ఫేమస్ జేమ్స్ బాండ్‌తో పోల్చడమేమిటనే సందేహం రావచ్చు. ఆయన పెట్టిన చిత్రాన్ని పరిశీలించి చూస్తే అసలు విషయం బయటపడుతుంది.

జేమ్స్ బాండ్ చిత్రంలో ఆయన ముఖం స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖాన్ని పెట్టిన ఓ ఫొటోను టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ పోస్టు పెట్టారు. ఈ పోస్టురులో 007కు వేరే అర్థం చెప్పారు. ‘వారు నన్ను 007 అని పిలుస్తారు’ అనే టైటిల్ పెట్టారు. కింద 007 అంటే ఒక్కోదాన్ని విడమరిచి చెప్పారు. డెవలప్‌మెంట్ జీరో అని, ఆర్థికాభివృద్ధి జీరో అని ఆరోపించారు. అలాగే, 7ను వివరించేలా ఏడేళ్ల ఆర్థిక దుర్వినియోగమని పేర్కొన్నారు. 

2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ ఈ దశాబ్దంలోనే కనిష్టానికి అంటే 3.1శాతానికి పడిపోయింది. 2014 నుంచి ఇంత స్థాయిలో జీడీపీ పడిపోవడానికి అందరూ పెద్దనోట్ల రద్దునే కారణంగా చూశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని విమర్శలపాలైన సంగతి తెలిసిందే. దీనికితోడు జీఎస్టీతోనూ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందనే వాదనలున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios