ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ఆయనను కాశ్మీర్ లో నియమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీపై ‘ది కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి విమర్శలు చేశారు. ఆయనను హేళన చేస్తూ మోడ్రన్ గాంధీ అంటూ అభివర్ణించారు. కాశ్మీర్‌లో రాహుల్‌ను నియమించాల్సిన సమయం ఆసన్నమైందని, ఉగ్రవాదానికి అహింసా మార్గంలో పరిష్కారం లభిస్తుందని వివేక్ ఎద్దేవా చేశారు.

ఛత్తీస్ ఘడ్ లో ఐదుగురి కిడ్నాప్: ఒకరిని హత్య చేసిన మావోయిస్టులు

ఇటీవల యూకేలోని కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్‌ కు హాజరైన రాహుల్ గాంధీ.. అక్కడి స్టూడెంట్లకు లెక్చర్ ఇస్తు భారతదేశానికి సంబంధించి అనేక విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను భారత్ జోడో యాత్రలో భాగంగా కాశ్మీర్ లో నడుస్తున్నప్పుడు లోయలో తాను చాలా దూరం నుంచి ఉగ్రవాదులను చూశానని తెలిపారు. 

Scroll to load tweet…

ఈ విషయాన్ని వివేక్ ఎగాతాళి చేస్తూ.. ‘‘కాశ్మీర్‌లో రాహుల్ గాంధీని పోస్ట్ చేసే సమయం వచ్చింది. ఉగ్రవాదులు వస్తారు. ఆయనను చూసిన తరువాత 'వినికిడి శక్తి' 'ప్రసారం' అవుతుంది. దీంతో వారు వెళ్లిపోతారు’’ అని రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఉగ్రవాదానికి నేటి గాంధీ ఆదర్శవంతమైన అహింసా పరిష్కారం అని వివేక్ అన్నారు.

క‌ర్నాట‌క ఎన్నిక‌లు: దూకుడు పెంచిన బీజేపీ.. వరుస ప్రచార ర్యాలీల మధ్య ఈ నెల 12 ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న

అంతకుముందు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులను చూసినప్పుడు భద్రతా సంస్థలకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆయన శుక్రవారం ప్రశ్నించారు. ‘‘కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు తనను చూశారని రాహుల్ చెప్పారు. అయితే వారు తనను లక్ష్యంగా చేసుకోరని తెలుసు. ఈ విషయాన్ని భద్రతా సంస్థలకు ఎందుకు తెలియజేయలేదు? రాహుల్‌ను రక్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా? ఈ విషయంలో ఉగ్రవాదులకు కొంత అవగాహన ఉందా ?’’ అని అన్నారు. 

పుల్వామా ఉగ్రదాడిని 40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న కారుబాంబుగా రాహుల్ గాంధీ అభివర్ణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘మన జవాన్లను అవమానించడానికి ఆయనకు ఎంత ధైర్యం? అది బాంబు కాదు. ఉగ్రదాడి. పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్ పేరు చెప్పడానికి ఆయన నిరాకరించడంలో ఆశ్చర్యం లేదు. మిలిటెంట్లతో కాంగ్రెస్ కు ఉన్న అవగాహనలో ఇది భాగమా?’’ శర్మ ప్రశ్నించారు. 

Scroll to load tweet…

‘‘మొదట విదేశీ ఏజెంట్లు మమ్మల్ని టార్గెట్ చేశారు.! ఇప్పుడు మనల్ని మనమే పరాయిదేశంలో టార్గెట్ చేసుకుంటున్నాం.! కేంబ్రిడ్జిలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకునే ముసుగులో విదేశీ గడ్డపై మన దేశాన్ని కించపరిచే ప్రయత్నం తప్ప మరొకటి కాదు’’ అని అన్నారు. కాగా.. హిమంత బిస్వా శర్మ ట్వీట్ ను రీట్వీట్ చేసిన అగ్నిహోత్రి.. ‘‘ఢిల్లీ కుటుంబానికి, గుప్కార్ రోడ్ కుటుంబానికి మధ్య విడదీయరాని స్నేహం గురించి ఎవరికి తెలియదు. కశ్మీర్ లో ఉగ్రవాదం వెనుక ఎవరున్నారు.’’ అని పేర్కొన్నారు.