ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మనీస్ సిసోడియాను రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్ లో ఉంచారు. జైలులో ఆయనకు సెల్ నెం.1 ను కేటాయించారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు సెల్ నెం.1 ను కేటాయించారు. మనీష్ సిసోడియా రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలుకు తరలించారు. జైలు సూపరింటెండెంట్ అంగీకారం తెలిపితే అతనికి ధ్యాన గదిని కేటాయించవచ్చని జైలు అధికారులు సోమవారం తెలిపారు.
సిసోడియా తన సహోద్యోగి, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు దూరంగా ఉన్న ప్రత్యేక సెల్‌లో ఒంటరిగా ఉంటారని తెలుస్తోంది. సిసోడియాను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జైలు యంత్రాంగం తెలిపింది. జైలు మాన్యువల్, అతనికి సంబంధించిన కోర్టు ఆదేశాల ప్రకారం వాటిని తాము ఖచ్చితంగా ఫాలో అవుతామని అధికారులు తెలిపారు.
తమిళనాడులో తీవ్ర విషాదం.. పొలంలోని విద్యుత్ కంచె తగిలి మూడు ఏనుగులు మృతి..
జైలులో సత్యేంద్ర జైన్ కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారన్న విషయం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిమీద ప్రతిపక్షలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. దీంతో సిసోడియా విషయంలో ఇలాంటి పరిస్థితి తిరిగి రాకుండా చూడాలని జైలు అధికారులు భావిస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జైన్ జైలులో నంబర్ 7వ గదిలో ఉన్నాడు.
సిసోడియా తన బ్యారక్‌లో ఒంటరిగా ఉంటారని, జైలులో ఎలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వబోరని అధికారులు తేల్చి చెప్పారు. "విపాసన/మెడిటేషన్ సెల్‌లో సిసోడియాను ఉంచడంపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు" అని ఒక అధికారి తెలిపారు. తీహార్ జైలు అధికారుల ప్రకారం, సిసోడియాకు రాత్రి భోజనానికి పప్పు, చావల్, సబ్జీ.. రోటీలు లేదా అన్నం ఇస్తారు. అతని కదలికలపై నిఘా ఉంచేందుకు అతని సెల్ బయట సీసీటీవీలు అమర్చారని, భద్రతా ఏర్పాట్ల గురించి కూడా చర్చ జరిగిందని ఆయన చెప్పారు.
మరో అధికారి మాట్లాడుతూ, సిసోడియా జైలు లోపల కొన్ని పనుల నిమిత్తం తన వార్డు నుంచి బయటకు వెళ్లినప్పుడు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైలు సిబ్బంది కొంత మంది వెంటవెడతారని చెప్పారు. "ఇప్పటి వరకు, అతను ఏమీ అభ్యర్థించలేదు, అతను ఇతర అండర్ ట్రయల్ ఖైదీల మాదిరిగానే అదే నిబంధనలను అనుసరిస్తున్నాడు" అని అధికారి చెప్పారు.
