న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులను ఎప్పుడు కలుస్తారంటే నిర్భయ కేసు దోషులు నోరు విప్పడం లేదు. నిర్భయ కేసు దోషులు వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముకేష్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలను జైలు నెంబర్ 3లో విడివిడి సెల్స్ లో ఉంచారు. వారికి ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్న విషయం తెలిసిందే.

తమ తమ కుటుంబ సభ్యులను ఎప్పుడు కలుస్తామనే విషయాన్ని దోషులు చెప్పడం లేదని తీహార్ జైలు అధికారులు గరువారంనాడు చెప్పారు. తమ కుటుంబ సభ్యులతో భేటీ కావడంతో పాటు తమ తమ ఆస్తులు ఎవరికి చెందుతాయనే విషయాన్ని కూడా వారు చెప్పాల్సి ఉంటుంది. ఆ విషయాలపై దోషులు నోరు విప్పడం లేదు. 

Also Read: చివరి కోరికపై మౌనంగా నిర్భయ దోషులు.. ఎందుకంత ధీమా.

న్యాయ ప్రిక్రియను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి దోషులు ప్రయత్నిస్తున్నారని అంటూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ బుధవారంనాడు తెలిపింది. డమ్మీ ఉరితీతను గత వారం నిర్వహించారు. దోషుల బరువును కూడా రికార్డు చేశారు. దాని ప్రకారమే డమ్మీ ఉరితీత నిర్వహించారు. 

సంచలను చెత్తతోనూ రాళ్లతోనూ నింపి వారు ఆ పనిచేశారు. దోషులను ఉరితీయడానికి మీరట్ నుంచి పవన్ జల్లాద్ ను పంపించనున్నట్లు ఉత్తరప్రదేశ్ జైలు అధికారులు తెలిపారు. భారత చరిత్రలో తొలిసారి నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీసే అవకాశం ఉంది. అందువల్ల జైలు అధికారులు,త సిబ్బంది ఎక్కువగా అవసరమవుతారు. వారితో జైలు అధికారులు ప్రతి రోజు మాట్లాడుతున్నారు. వారికి మానసిక స్థైర్యాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు.

Also Read: ఒక్కేసారి కాదు, ఒకరి తర్వాత ఒక్కరిని ఉరి తీయండి: నిర్భయ తల్లి

2012 డిసెంబర్ 16వ తేదీన జరిగిన నిర్భయ రేప్, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థిని అత్యంత ఘోరంగారేప్ చేసి, చిత్రహింసలు పెట్టారు. దాంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.