న్యూఢిల్లీ: దోషులు చట్టంతో ఆటలాడుకోవాలని చూస్తున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ ఒకేసారి కాకుండా ఒక్కరి తర్వాత ఒక్కరిని ఉరి తీయాలని, అప్పుడు చట్టం అంటే ఏమిటో వారికి తెలిసి వస్తుందని ఆమె అననారు. 

ఫిబ్రవరి 1వ తేీదన దోషులందరికీ ఉరిశిక్ష అమలైతేనే తనకు ఆత్మ సంతృప్తి కలుగుతుందని ఆమె అన్నారు. ఏడేళ్ల క్రితం 2012 డిసెంబర్ లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేసిన విషయం తెలిసిందే. 

Also Read: పవన్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం: నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్

నిర్భయ కేసులో నలుగురు దోషులు ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్,య్ కుమార్ ఠాకూర్ లకు దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. అప్పటి నుంచి దోషులకు ఉరిశిక్ష ఎప్పుడు పడుతుందా అనే ఎదురు చూస్తూ వస్తున్నారు. 

అయితే, దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి చట్టపరమైన మార్గాలను అన్నింటినీ దోషులు ఉపయోగించుకుంటూ వస్తున్నారు. చివరగా, నేరం జరిగిన సమయంలో తాను మైనర్ ను అంటూ పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు కోట్టేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఆ పటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. 

నిర్భయ దోషులను జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో ఉరి తీయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. అయితే, వినయ్ శర్మ, ముకేష్ కుమార్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్లను దాఖలు చేసారు. వాటిని సుప్రీంకోర్టు కొట్టేసింది. 

Also Read: నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా తరఫు లాయర్ కు షాక్.

అయితే, ఆ తర్వాత ముకేష్ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. దాన్ని రాష్ట్రపతి తోసిపుచ్చారు. ఈ క్రమంలో జనవరి 22వ తేదీన దోషులను ఉరి తీయడం సాధ్యం కాదని భావించి కోర్టు కొత్తగా మరో డెత్ వారంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని కోర్టు ఆ వారంట్ జారీ చేసింది.