రైలు ఢీ కొనడగంతో ఓ పెద్ద పులి చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూరా అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. 

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా అటవీ ప్రాంతంలో శుక్రవారం ఓ పులి రైలు కిందపడి మృతి చెందింది. ఈ విషయాన్ని స్థానిక సీనియర్ అటవీ అధికారి వెల్లడించారు. హైదరాబాద్-బల్లార్షా మార్గంలో రైల్వే ట్రాక్‌పై రైల్వే గ్యాంగ్‌మెన్ పులి కళేబరాన్ని గుర్తించడంతో ఉదయం ఈ మరణం వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

నన్ను రాష్ట్రపతిని చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. కోర్టు ఏమన్నదంటే?

ఈ విషయం అటవీశాఖకు తెలియడంతో ఓ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. రాజురా రేంజ్‌లోని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ సురేశ్ యెల్కర్వార్ మాట్లాడుతూ.. చనిపోయిన జంతువు పెద్ద పులి అని పేర్కొన్నారు. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి 29 కిలోమీటర్ల దూరంలోని రాజురా తహసీల్‌లోని చునాలా బీట్‌లో పులి మృతదేహం లభ్యమైంది.

Scroll to load tweet…

చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు చెందిన పశువైద్యులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్‌మార్టం నిర్వహించారు. అయితే పులి శరీరంపై పలు గాయాలు కనిపించాయని వారు తెలిపారు. అటవీ సిబ్బంది సమక్షంలో మార్గదర్శకాల ప్రకారం పెద్ద పులిని దహనం చేసినట్లు పేర్కొన్నారు.