నన్ను రాష్ట్రపతిని చేయాలని, ఇటీవలే జరిగిన ఎన్నికల్లో తనను పోటీకి అనుమతించలేదని ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సంచలన పిటిషన్ దాఖలైంది. తనను దేశ రాష్ట్రపతిగా నియమించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వెంటనే ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇదే అంశంపై భవిష్యత్‌లో మళ్లీ పిటిషన్ వేస్తే.. దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రిజిస్ట్రీకి తెలిపింది.

ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లీల ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ పనికిమాలినదని పేర్కొంది. అంతేకాదు, కోర్టు ప్రక్రియను దుర్వినియోగపరచడమే అని తెలిపింది. ఈ పిటిషన్ పరిహాసం లాగే ఉన్నదని వివరించింది.

Also Read: మత తటస్థ దేశంలో విద్వేష ప్రసంగాలు ఊహించలేం.. వారిపై యాక్షన్ తీసుకోండి లేదంటే కోర్టును ధిక్కరించినట్టే: సుప్రీం

కిశోర్ జగన్నాథ్ సావంత్ ఈ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌ను మల్లీ ఎంటర్‌టైన్ చేయరాదని రిజిస్ట్రీకి ఆదేశించారు. ఇలాంటి అంశాలపై వచ్చే పిటిషన్లనూ సమీప భవిష్యత్‌లో పరిగణనలోకి తీసుకోరాదని తెలిపారు. ఈ పిటిషన్ వేసిన జగన్నాథ్ సావంత్ స్వయంగా వాదించుకున్నారు. ఈ వాదనలను రికార్డుల నుంచి తొలగించాలని రిజిస్ట్రీకి ఆదేశించారు.

ఇటీవలే జరిగిన అధ్యక్ష ఎన్నికలో తనను పోటీ చేయడానికి అనుమతించలేదని సుప్రీంకోర్టులో కిశోర్ జగన్నాథ్ సావంత్ వాదించారు. తనను తాను పర్యావరణ కార్యకర్తగా పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని క్లిష్ట పరిస్థితులను తాను చక్కదిద్దగలనని తెలిపారు.