నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Thursday 22nd September Telugu News

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:36 PM IST

రేపు పాదయాత్రకు రాహుల్ బ్రేక్

భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ శుక్రవారం బ్రేక్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో పలువురు పెద్దలు పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారితో చర్చలు జరిపేందుకు రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వాటిని ముగించుకుని ఎల్లుండి కేరళకు తిరిగి చేరుకుంటారు రాహుల్. శనివారం తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు. 
 
8:44 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో మరికొందరు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో మరికొందరు సీనియర్‌లు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శశిథరూర్, అశోక్ గెహ్లాట్‌లు పోటీ చేయడం ఖాయం కాగా.. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్, మనీశ్ తివారీ, ముకుల్ వాస్నిక్, మల్లిఖార్జున ఖర్గే వంటి వార్ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. 
 
7:37 PM IST

లక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం మహారాష్ట్రకు చెందిన లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది. ఈ బ్యాంక్ వద్ద సరిపడా మూలధనం లేదని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. లిక్విడేషన్ ప్రక్రియలో భాగంగా డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద రూ. 5 లక్షల వరకు పొందవచ్చని వివరించింది. ఈ ఆదేశాలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

6:44 PM IST

ఏపీలో ప్లాస్టిక్‌పై నిషేధం

ఏపీలో ప్లాస్టిక్ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నవంబర్ 1 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతికి అనుమతి లేదని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. 

6:09 PM IST

ఎన్టీఆర్‌ను అవమానించడమే : పురందేశ్వరి

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై ఆయన కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఫైరయ్యారు. అన్న గారిపై గౌరవం వుందని చెబుతూనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని ఆమె హితవు పలికారు. కారణంగా లేకుండా పేరు మార్చడం ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమేనని పురందేశ్వరి పేర్కొన్నారు. 
 
4:50 PM IST

షబ్బీర్ అలీని సస్పెండ్ చేయండి : ప్రియాంక గాంధీకి కోమటిరెడ్డి లేఖ

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నారు. సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాసారు. 

4:08 PM IST

మోహన్ భగవత్ పై ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ప్రశంసలు

ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాజ్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అనంతరం ఉమర్ అహ్మద్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ పై ప్రశంసలు కురిపించారు. భగవత్ ను రాష్ట్ర పితగా సంబోధించారు. భారతీయులందరి డిఎన్ఎ ఒకటేనని... కేవలం దేవున్ని పూజించే పద్దతులే వేరని ఉమర్ అహ్మద్ పేర్కొన్నారు. 

3:17 PM IST

కేసీఆర్ ఓ థర్డ్ క్లాస్ బ్రోకర్... కేటీఆర్ డ్రగ్స్ అడిక్ట్: ఎంపి అరవింద్

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ఓ థర్డ్ క్లాస్ బ్రోకర్ అని కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. డ్రగ్స్ తీసుకుని ఆ మత్తులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దంటూ అరవింద్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కేసీఆర్ బిడ్డలు కేటీఆర్, కవిత అరెస్ట్ ఖాయమని అరవింద్ పేర్కొన్నారు. 

1:53 PM IST

యూపీలో విషాదం... గోడ కుప్పకూలి నలుగురు చిన్నారులు మృతి

ఉత్తర ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు ఏడుగురి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఎటావా జిల్లా చంద్రపుర గ్రామంలో వర్షాలకు బాగా తడిచిన గోడలు అర్ధరాత్రి కుప్పకూలాయి. దీంతో నిద్రిస్తున్న నలుగురు చిన్నారులతో పాటు వాళ్ల నాన్నమ్మ మృతిచెందారు. మరో ఘటనలో పెట్రోల్ బంక్ గోడ కూడా గుడిసెపై పడటంతో భార్యాభర్తలు మృతిచెందారు. ఈ ఘటన కృపాల్ పూర్ లో చోటుచేసుకుంది. 
 
12:16 PM IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్పుపై వైఎస్ షర్మిల అభ్యంతరం

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్చిన జగన్ సర్కార్ వైఎస్సార్ పేరు పెట్టడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభ్యంతరం వ్యక్తంచేసారు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూపోతే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పేర్లనే కొనసాగించాలని... అలాగయితే తరతరాలకు వారి గొప్పతనం తెలుస్తుందన్నారు. 

11:19 AM IST

కాంగ్రెస్ నూతన అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ...

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది.  కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మదుసూధన్ మిస్త్రీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసారు. 

10:31 AM IST

డాలర్=రూ.80.47...  రూపాయి విలువ భారీగా పతనం

భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పతనమైంది. తాజాగా 57పైసలు పతనమై యూఎస్ డాలర్ తో 80.47 రూపాయలకు చేరింది.  

9:51 AM IST

భారత్ లో 50వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,443 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు భారత్ లో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 4,45,53,042 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 46,342 యాక్టివ్ కేసులు వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

9:40 AM IST

క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్...జింఖానలో ఇండియా-ఆసిస్ టీ20 టికెట్ల విక్రయం

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ లో జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలపై గందరగోళం తొలగింది. చాలాకాలం తర్వాత నగరంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టికెట్లు దొరక్క తీవ్ర నిరాశకు గురయ్యారు. అభిమానుల ఆగ్రహంతో దిగివచ్చిన హెచ్‌సీఏ ఇవాళ ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో టికెట్లు అమ్మకానికి పెట్టింది. 

9:36 PM IST:

భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ శుక్రవారం బ్రేక్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో పలువురు పెద్దలు పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారితో చర్చలు జరిపేందుకు రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వాటిని ముగించుకుని ఎల్లుండి కేరళకు తిరిగి చేరుకుంటారు రాహుల్. శనివారం తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు. 
 
8:44 PM IST:

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో మరికొందరు సీనియర్‌లు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శశిథరూర్, అశోక్ గెహ్లాట్‌లు పోటీ చేయడం ఖాయం కాగా.. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్, మనీశ్ తివారీ, ముకుల్ వాస్నిక్, మల్లిఖార్జున ఖర్గే వంటి వార్ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. 
 
7:37 PM IST:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం మహారాష్ట్రకు చెందిన లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది. ఈ బ్యాంక్ వద్ద సరిపడా మూలధనం లేదని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. లిక్విడేషన్ ప్రక్రియలో భాగంగా డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద రూ. 5 లక్షల వరకు పొందవచ్చని వివరించింది. ఈ ఆదేశాలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

6:44 PM IST:

ఏపీలో ప్లాస్టిక్ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నవంబర్ 1 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతికి అనుమతి లేదని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. 

6:09 PM IST:

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై ఆయన కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఫైరయ్యారు. అన్న గారిపై గౌరవం వుందని చెబుతూనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని ఆమె హితవు పలికారు. కారణంగా లేకుండా పేరు మార్చడం ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమేనని పురందేశ్వరి పేర్కొన్నారు. 
 
4:50 PM IST:

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నారు. సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాసారు. 

4:08 PM IST:

ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాజ్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అనంతరం ఉమర్ అహ్మద్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ పై ప్రశంసలు కురిపించారు. భగవత్ ను రాష్ట్ర పితగా సంబోధించారు. భారతీయులందరి డిఎన్ఎ ఒకటేనని... కేవలం దేవున్ని పూజించే పద్దతులే వేరని ఉమర్ అహ్మద్ పేర్కొన్నారు. 

3:17 PM IST:

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ఓ థర్డ్ క్లాస్ బ్రోకర్ అని కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. డ్రగ్స్ తీసుకుని ఆ మత్తులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దంటూ అరవింద్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కేసీఆర్ బిడ్డలు కేటీఆర్, కవిత అరెస్ట్ ఖాయమని అరవింద్ పేర్కొన్నారు. 

1:53 PM IST:

ఉత్తర ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు ఏడుగురి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఎటావా జిల్లా చంద్రపుర గ్రామంలో వర్షాలకు బాగా తడిచిన గోడలు అర్ధరాత్రి కుప్పకూలాయి. దీంతో నిద్రిస్తున్న నలుగురు చిన్నారులతో పాటు వాళ్ల నాన్నమ్మ మృతిచెందారు. మరో ఘటనలో పెట్రోల్ బంక్ గోడ కూడా గుడిసెపై పడటంతో భార్యాభర్తలు మృతిచెందారు. ఈ ఘటన కృపాల్ పూర్ లో చోటుచేసుకుంది. 
 
12:16 PM IST:

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్చిన జగన్ సర్కార్ వైఎస్సార్ పేరు పెట్టడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభ్యంతరం వ్యక్తంచేసారు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూపోతే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పేర్లనే కొనసాగించాలని... అలాగయితే తరతరాలకు వారి గొప్పతనం తెలుస్తుందన్నారు. 

11:19 AM IST:

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది.  కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మదుసూధన్ మిస్త్రీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసారు. 

10:31 AM IST:

భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పతనమైంది. తాజాగా 57పైసలు పతనమై యూఎస్ డాలర్ తో 80.47 రూపాయలకు చేరింది.  

9:51 AM IST:

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,443 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు భారత్ లో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 4,45,53,042 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 46,342 యాక్టివ్ కేసులు వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

9:40 AM IST: