Asianet News TeluguAsianet News Telugu

మా అమ్మ చాక్లెట్లు దొంగిలించింది.. అరెస్ట్ చేయండి.. పోలీస్ స్టేషన్ లో బుడ్డోడు.. వీడియో వైరల్...

మధ్యప్రదేశ్ లో ఓ బుడ్డోడి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో నవ్వులు పూయిస్తోంది. మూడేళ్ల ఆ చిన్నారి తన తల్లిమీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది చూస్తే మీరూ నవ్వడం ఖాయం.

three years old boy complaint on her mom for stealing his chocolates, video goes viral in madhyapradesh
Author
First Published Oct 18, 2022, 7:57 AM IST

మధ్యప్రదేశ్ : చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయి.. అన్నం సరిగా తినరు.. పొట్టలో నులిపురుగులు పడతాయి.. ఇలా రకరకాల కారణాలతో తల్లులు పిల్లల్ని ఎక్కువగా చాక్లెట్లు, క్యాండీలు తినకుండా ఆపుతుంటుంటారు. అంతేకాదు.. ఎవరైనా పిల్లలు కదా అని ముద్దుగా ఎక్కువ తక్కువ చాక్లెట్లు ఇస్తే వారిని మాటల్లో పెట్టో, మాయచేసో వారి దగ్గరి నుంచి అవి తీసేసుకుని.. తరువాత ఒక్కటొక్కటిగా ఇస్తుంటారు. ఇది అందరు తల్లులూ చేసే పనే. అయితే.. ఇదే ఓ బుడ్డోడికి కోపం తెప్పించింది. 

తల్లి తన చాక్లెట్లన్నీ తనకివ్వకుండా.. దొంగిలిస్తుందని కోపానికి వచ్చాడు. అంతే.. తండ్రిని వెంట బెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అలా ఓ మూడేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆ  చిన్నారి మాటలు చూసి అక్కడున్న పోలీసులు పగలబడి నవ్వారు.  కానీ మనోడు చెప్పిన ప్రతి అక్షరాన్ని కంప్లైంట్ గా తీసుకున్నారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటంటే.. 

లోన్ రీపేమెంట్ చేయలేదని బైక్‌కు కట్టేసుకుని నడి వీధిలో పరుగెత్తించారు.. కటక్‌లో జరిగిన ఘటన వీడియో వైరల్

తండ్రిని వెంట పెట్టుకుని మరి ఈ చిన్నారి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. తన సొంత తల్లిపై ఫిర్యాదు చేశాడు. వాడు ఏం చెబుతున్నాడంటే.. వాళ్ళ అమ్మ వాడిని అసలు చాక్లెట్లు తిననివ్వడం లేదట.. వాటిని దొంగిలించకుండా ఉండాలని,  తనకు దొరకకుండా దాచిపెడుతోందట.. అంతేకాదు క్యాండీలు కావాలని  అడిగినప్పుడల్లా కొడుతుందట..  బుడ్డోడు ఎంతో క్యూట్ గా వచ్చీరాని మాటలతో.. ముద్దు ముద్దుగా ఈ విషయాలు చెప్పడం అక్కడున్న వారందరిలోనూ నవ్వులు పూయించింది. పోలీసులు కూడా చిన్నాడేదో చెబుతున్నాడని సరదాగా తీసుకోలేదు. 

చిన్నారికి నమ్మకం కలిగేలా.. ఓ మహిళా పోలీసులు కూడా అతను చెప్పిన ప్రతి అక్షరాన్ని ఫిర్యాదులో రాసింది. చిన్నారికి కాటుక పెట్టే సమయంలో అతడు చాక్లెట్లు తింటూ.. అటూ, ఇటూ కదలడంతో వాళ్ళ అమ్మకి కోపం వచ్చి చెంపపై చిన్నా కొట్టిందని తండ్రి చెప్పాడు. వెంటనే తనను పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్ళమని మారాం చేశాడని వివరించాడు. దీంతో తప్పక తమ కుమారుడిని స్టేషన్కు తీసుకు వచ్చినట్లు చెప్పాడు. ఇంత చిన్న వయస్సులో పోలీస్ స్టేషన్కు వెళ్లి సొంత తల్లి పై ఫిర్యాదు చేసిన  అతడి అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.  మధ్యప్రదేశ్ బర్హాన్ పూర్ జిల్లా డేడ్ తలాయి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇదే.. 

 

Follow Us:
Download App:
  • android
  • ios